అనంత సకారాత్మకత తొ మనము గెలుస్తాం అంటూ మే 11 నుండి నిర్వహిస్తున్న ‘హమ్ జితేంగే – పాజిటివిటీ అన్‌లిమిటెడ్’ ధారావాహిక ఉపన్యాస మాలిక మూడవ రోజు, పూజ్య శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి, ప్రముఖ కళాకారిణి సోనాల్ మాన్సింగ్ విశ్వాసం నిలుపుకోవాలని పిలుపునిచ్చారు. కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో గెలవడానికి ఇది కచ్చితంగా సహాయపడుతుందని, మన చుట్టూ మరింత సానుకూల ఆలోచనలను పంచుకోవాలని వారు చెప్పారు. ఈ ఐదు రోజుల ఉపన్యాస సిరీస్‌ను సమాజంలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో ‘కోవిడ్ రెస్పాన్స్ టీం’ నిర్వహిస్తున్నది.
నేటి కార్యక్రమం లో….
ప్రపంచంలో మహమ్మారి కారణంగా ఈ రోజు మనం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని పూజ్య శంకరాచార్యులు విజయేంద్ర సరస్వతి తన ప్రసంగంలో అన్నారు. ఏడాది క్రితం ఈ సమస్య భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో ఈ సంక్షోభం సమాజపు కృషి, సహకారం, అందరి సానుభూతి ద్వారా అధిగమించాము. ఇప్పుడు అదే సంక్షోభం మళ్ళీ అలుముకుంది కాని ఈసారి అది చాలా ఘోరంగా ఉంది. కానీ మనం ఈ సంక్షోభాన్ని కూడా అధిగమించగలగాలి. “ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రార్థన చేయాలి. వాల్మీకి రామాయణంలో సంకట మోచక హనుమాన్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దుఖం ఉంది, సంక్షోభం ఉంది, పరిస్థితి ఏమైనప్పటికీ, ప్రయత్నిస్తూనే ఉండండి” అని పూజ్య శంకరాచార్యులు అన్నారు. “సంక్షోభం ఎలా ఉన్నా, మనము విశ్వాసంతో కష్టపడి పనిచేస్తే, ఫలితాలను పొందుతాము, విజయవంతం అవుతాము. గత సంవత్సరం సంక్షోభంలో వివిధ భాషలను మాట్లాడే ప్రజలు, వివిధ రాష్ట్రాల ప్రజలు కలిసి పనిచేశారు ఫలితం కూడా చాలా అనుకూలంగా ఉంది . “ప్రస్తుత సవాలును అధిగమించడానికి రెండు రకాల ప్రయత్నాలు అవసరం. ఒకటి ప్రార్థన, సదాచారం. రెండవది అస్వస్థతను నయం చేసుకునేందుకు వైద్య చికిత్స కోసం వెళ్ళడం. అయితే అదే సమయంలో, సహనం, విశ్వాసం కూడా అవసరం.” “సహనం, విశ్వాసం ఉంటే, సంక్షోభం ఎలా ఉన్నా మనం దాని నుండి బయటకు రావచ్చు. వ్యక్తిగత విశ్వాసం అవసరం, అలాగే సమిష్టి స్థాయిలో సానుకూల వాతావరణాన్ని సృష్టింఛాలి” అని పూజ్య శంకరాచార్యులు అన్నారు.
ప్రముఖ కళాకారిణి మరియు పద్మవిభూషణ్ సోనాల్ మాన్సింగ్ తన వ్యక్తిగత అనుభవాలను తన ప్రసంగంలో పంచుకుంటూ,… తానుఇటీవల కరోనాతో బాధపడ్డానని, అయితే సానుకూల ఆలోచనలు, సహనం, ఆత్మవిశ్వాసం, ప్రార్థన ద్వారా దానిని అధిగమించానని, ఇది తనలో నిరాశను దూరం చేసిందని అన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ “సమాజంలో అనంతమైన ఆశ, సానుకూల వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది, అప్పుడు ఎవరూ నిరాశకు లోనుకారు.” అని ఆమె నొక్కి చెప్పారు. “ఇందుకోసం, మనము సృజనాత్మకత ఆసరా తీసుకోవచ్చు. మనసులో కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. మనమందరం ఈ యుద్ధంలో పోరాడుతున్నాం మరియు మనకు కచ్చితంగా విజయం లభిస్తుంది. అయితే దీని కోసం మనం మనల్ని అస్సలు నిస్సహాయంగా భావించకూడదు. కోపం, నిరాశ, ఒత్తిడులకు దూరంగా ఉండాలి. సానుకూల ఆలోచనలను పంచుకోవాలి. సమాజంలో సామూహిక స్థాయిలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఇతరులకు మద్దతు ఇవ్వాలి.”అని అన్నారు.
ఈ ఉపన్యాస సిరీస్ మే 11 నుండి మే 15 వరకు రోజూ సాయంత్రం 4:30 గంటలకు 100 కి పైగా మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అవుతోంది. మే 14 న వాత్సల్యధామ్ కు చెందిన దీదీమా సాధ్వీ రితంభర జీ, శ్రీ పంచాయతీ అఖారా-నిర్మల్ నుండి సంత్ జ్ఞాన్ దేవ్ సింగ్ జీ దేశప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
– లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ కన్వీనర్, కోవిడ్ రెస్పాన్స్ టీం మొబైల్ నంబర్: 7042 500 558
విజ్ఞప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE