Home News నీట చిక్కిన వారిని కాపాడిన సేవాభారతి స్వయంసేవకులు

నీట చిక్కిన వారిని కాపాడిన సేవాభారతి స్వయంసేవకులు

0
SHARE

కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు గేట్లు అన్ని తెరిచి నీటిని క్రిందికి వదిలివేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలైన ధర్మపురి, దండెపల్లి, కోటపల్లి, చెన్నూరు మంచిర్యాల పట్టణాలలోకి నీళ్ళు వచ్చాయి. NTR నగర్‌, పద్మశాలి నగర, గణేశ్ నగర్, సంజీవ నగర్, రెడ్డి కాలనీ, వికాస్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు వచ్చి NTRనగర్ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. ప్రజలు కట్టుబట్టలతో బయటికి వచ్చారు. ఈ నేప‌థ్యంలో ఆర్‌.ఎస్‌.ఎస్ కార్య‌క‌ర్త‌లు ఒక బృందంగా ఏర్పడి ఎంతో సాహ‌సంగా ముందుకు వ‌చ్చి ఎంతోమంది ప్రజలను నీళ్లలో నుండి బయటకు తెచ్చి రక్షించారు.

ఈ సమయంలో విశ్వహిందూపరిషత్ కార్యకర్తలైన శశికిరణ్ మిత్ర బృందం గాయాలు తగిలిన కూడా లెక్క చేయకుండా బుధవారం ఉదయం 11 గంటల నుంచి గురువారం ఉదయం 3 గంటల వరకు శ్రమించి, 15 నుంచి 20 ఫీట్ల లోతు నీళ్లలో తాడు లైఫ్ జాకెట్స్ , ఫ్లూటింగ్ రింగ్స్ తీసుకువెళ్లి శరణార్థులకు బిగించి, ధైర్యం చెప్పి తిరిగి వరద నీటిలో ఈదుతూ సురక్షిత ప్రాంతానికి సుమారు 60 మందిని రక్షించారు. కొన్ని స్థలాలలో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వరకు కూడా నీళ్లు వచ్చినా కూడా, శశికిరణ్ స్వయంగా హార్స్ రైడింగ్ క్లబ్ నడిపిస్తున్నందున తన క్లబ్బులోని గుర్రాల సహాయంతో ఎంతోమందిని నిర్విరామంగా కృషి చేయడం వల్ల చాలామందిని నీటి నుండి బయటకు తెచ్చి వారి ప్రాణాలను రక్షించారు.