సేవ, సమరసత, సంఘటిత సమాజ నిర్మాణమే సంఘ్ ధ్యేయమని, అందుకు అనుగుణంగా సమాజంలోని కుల అంతరాలను తొలగించడానికి స్వయంసేవకులు సమరసత సాధిస్తూ మార్పు తీసుకొని వస్తున్నారని అర్ ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సామజిక సమరసత ప్రముఖ్, శ్రీ అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు.
శంషాబాద్ సమీపంలోని ఒయాసిస్ పాఠశాలలో 20 రోజుల పాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కార్యకర్తల ద్వితీయవర్ష శిక్షణ వర్గ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు.
అప్పాలప్రసాద్ మాట్లాడుతూ అర్ ఎస్ ఎస్ అంటేనే హిందుత్వం అనే భావన ఉందన్నారు. హిందుత్వం అంటే మానవత్వం, కరుణ, త్యాగం, దానం, వైరాగ్యం, మంచి మానవున్ని తీర్చిదిద్దే ధర్మం. దీన్నే ప్రపంచవ్యాప్తం చేయటానికి పూర్వికులు “కృన్వన్తో విశ్వమార్యం” అన్నారు. చరిత్రలో చాల మతాలు ఇతర దేశాలు, మతాలపై దాడి చేశాయి. ముస్లిం లు దాడి చేసి పర్షియా ( జోరాస్ట్రియన్ లు) ను ద్వంసం చేశారు. రోమ్ , గ్రీకు దేశాల్లో క్రైస్తవులు క్రైస్తవమయం చేశారు. మన దేశం పైన తీవ్రంగా మొఘలులు, ఆంగ్లేయుల దాడి చేసినప్పటికిని మన దేశం ఈ అవరోధాలను తట్టుకొని నిలచింది. ప్రపంచమంతా ప్రజ్ఞ్య , కరుణ ఉండాలని మనం కోరుకుంటాము. పురణేతిహసాల స్ఫూర్తితో అందరూ ధర్మ రక్షణకి నడుం కట్టారు. సానుకూల సంకల్ప శక్తి దేశాన్ని నిలబెట్టింది అని అన్నారు.
హిందువు గుణవంతుడు కావాలి . హిందూ పునరుజ్జీవన కార్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే కార్యకర్తలు కావాలి. దానికి డాక్టర్ జీ సంఘాన్ని స్థాపించారు. శాఖను ప్రారంబించారు.
పరమ పూజనీయ మోహన్ జీ, “ఒకే నీటి వ్యవస్థ, స్మశానం , దేవాలయం” ఉండాలని కోరారు. ఆ ప్రయత్నంలో భాగంగా జగిత్యాల, అంతర్గాం, కరీంనగర్ లోని చిన్నమెట్ పల్లిలో ఒకే స్మశాన నిర్మాణం జరిగింది. వీటి ద్వార సమరసత ను చాటి చెప్పారు. తెలంగాణలో షెడ్యుల్ వర్గానికి చెందిన 700 మందికి పూజారి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
మనకు రాజ్యాంగం స్వేచ్చా సమానత్వం , సోదర భావాన్ని అందించింది. వీటి అమలుకు స్వయంసేవకులు పనిచేస్తున్నారు. కాని వామపక్షలు, ముస్లిం, క్రైస్తవులు సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దళిత వాదమని, అంబేద్కర్ పేరుతో దేశాన్ని చీల్చే కుట్రలు సైతం జరుగుతున్నాయి. దక్షిణ భారత దేశం కావాలనే ప్రకటనలు కూడా మనం ఈ మద్య వింటున్నాము. ఇలాంటి భావజాలన్ని ప్రమాదకరమని, దాన్ని సమాజం గుర్తుంచాలని కోరారు.
దేశంలో ఆవు కారణంగా వృత్తులు, వృత్తి కారణంగా గ్రామాల్లో పాఠశాలలు, దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఆంగ్లేయుల కుట్రల వలన గోవు నాశనమయింది. గోఆధారిత వ్యవసాయం కోసం స్వయంసేవకులు చాలామంది పనిచేస్తున్నారు.
అమాయకంగా మతం మారిన హిందువులను తిరిగి పునరాగమనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సత్యం- శివం-సుందరం సంఘ ద్యేయం. సత్యం పునాదులపైన దేశం నడుస్తుంది. సమాజంలో ఇంకా ఆర్థిక సామజిక ఉపాధి, సాంస్కృతిక మార్పు రావాల్సి ఉంది అని అప్పాలప్రసాద్ అన్నారు.
కార్యక్రమ ముఖ్య అతిదిగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు శ్రీ దాసోజు శ్రీధర్ మాట్లాడుతూ, ఇతరుల భాదను అర్ధం చేసుకోగలిగితే సమాజం సుఖంగా ఉంటుంది. సమాజంలో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టాలి. సంవేదన కలిగి సమాజ సేవ చేయాలి అని కోరారు.
ఈ 20 రోజుల శిక్షణ వర్గ లో 198 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న శిబిర అధికారి శ్రీ సింహాద్రి సత్యనారాయణ, శిబిర కార్యవాహ శ్రీ యుగంధర్, దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఏలే శ్యాం జి, సేవ ప్రముఖ్ శ్రీ ఎక్క చంద్రశేఖర్, తెలంగాణా ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్, కార్యవాహ శ్రీ కాచం రమేష్ స్వయంసేవకులకు మార్గ దర్శనం చేశారు.