Home Rashtriya Swayamsevak Sangh శ్రీ గురూజీ రాష్ట్ర ఋషి

శ్రీ గురూజీ రాష్ట్ర ఋషి

0
SHARE

మాఘ బహుళ ఏకాదశి (Feb-27-2021) శ్రీ గురూజీగా ప్రసిద్ధి చెందిన RSS రెండవ సర్ సంఘచాలక్ ప‌ర‌మ పూజ‌నీయ మాద‌వ‌రావు స‌దాశివ‌రావు గోళ్వ‌ల్క‌ర్ జ‌యంతి. గురూజీ 1906 ఫిబ్రవరి 19న నాగపూర్ లో రామ్ టెక్ లో జన్మించి Msc&LLb  చదివిన తరువాత కొద్ధి కాలం పాటు BHU లో ప్రొఫెసర్ గా పని చేశారు. వీరు గొప్ప మేధావి, బుద్ధిశాలి, సూక్ష్మగ్రాహి, వివిధ విషయాల పట్ల అవగాహన కలిగి వుండేవారు. మంచి  అధ్యయన శీలి కూడా. తన వేతనములో ఎక్కువ భాగము పేద విద్యార్థుల కళాశాల చదువులకై, పుస్తకాలకై ఖర్చు చేసేవారు.  విద్యార్థులు తమ  అనుమానాల నివృత్తికై తన విభాగమునకు సంబంధించనివైనా చదివి భోదించేవారు అందుకే అందరూ  విద్యార్థులు వారిని  ప్రేమగా  “గురూజీ ” అని పిలిచే వారు. తరువాత కూడా  అదే పేరు స్థిర పడిపోయింది.

గురూజీ జీవితం లోకి సంఘం, ఆధ్యాత్మిక జీవితం రెండు షుమారుగా సమాంతరంగా  ప్రవేశించాయి. కానీ వారు స్వామి వివేకానంద అంతర్ దృష్టి, ఆచరణాత్మకమైన దృక్పధం కు దగ్గరగా ఉన్న సంఘ కార్యాన్ని తన జీవితంలో ఏకైక లక్ష్యంగా  చేసుకున్నారు. తన తల్లి గారు వివాహం చేసుకోకుంటే మన వంశం అంతరించిపోతుంది అని చెప్పినప్పుడు ప్రస్తుత పరిస్థితిలో సమాజ శ్రేయస్సు కోసం మన వంశం అంతరించిపోయినా పర్వాలేదు అని తన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. నెమ్మదిగా RSS సంస్థాపకులు పూజనీయ డాక్టర్ జీ సహచర్యంలో సంఘకార్యంలో పూర్తిగా లీన‌మ‌య్యారు. గురూజీతో పాటు ఉన్న అందరూ కూడా గురూజీ ని డాక్టర్ జి హృదయంగా అభివర్ణించేవారు. పూజనీయ డాక్టరీ సూచనతో వారి తదనంతరం గురూజీ  ఆర్ఎస్ఎస్ కు ద్వితీయ సర్ సంఘచాలక్ గా 1940లో  బాధ్యతను స్వీకరించడం జరిగింది.

గురూజీ సర్ సంఘ చాలక్ గా బాధ్యతలు  స్వీకరించిన మొదటి కొన్ని సంవత్సరాలు సంఘానికి, దేశానికి పరీక్ష కాలం కొనసాగింది. ఒక వైపు దేశానికి స్వాతంత్రం సిద్దించింది. కానీ దేశం రెండు ముక్కలయ్యింది. కాశ్మీర్ విలీన సమస్య గాంధీజీ హత్య నెపంతో  సంఘంపై నిషేధానికి గురైంది. కానీ  వారు ఈ పరీక్ష సమయంలో ఎంతో గొప్ప నాయకత్వ పటిమను ప్రదర్శించి ఎదురైన అన్ని సవాళ్ల నుండి సంఘాన్ని దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు.

గురూజీ దేశం అంతటా పర్యటించి స్వయంసేవకులకు ఉద్వేగబరితమయిన పిలుపును ఇచ్చారు “ఈ సంక్షోభ సమయంలో మనం జన్మించడం మన అదృష్టం దేశం పట్ల మన బాధ్యతలను, త్యాగస్ఫూర్తిని ధైర్య సాహసాలను చూపించే అవకాశం ఇదే అని సందేశం ఇచ్చారు . గురూజీ దేశ విభజనకు వ్యతిరేఖంగా నిలబడాల‌ని సమాజానికి సందేశం ఇచ్చారు. గురూజీ దేశ విభజనను అంతిమ సత్యంగా భావించలేదు.  కానీ అప్పటికే మహ్మద్ అలీ జిన్నా నేతృత్వం లో ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంది. ముస్లింలు అనేక చోట్ల హిందువులపై దాడులు చెయ్యడం ప్రారంభించారు. అప్పటి కాంగ్రెస్ నాయకత్వం చేతులు ఎత్తేసి విభజనకు మొగ్గు చూపారు.

పాకిస్థాన్ ఉద్భవించే ప్రాంతా ల నుండి హిందువులను సురక్షితంగా వెనుకకు తీసుకువచ్చే విధంగా స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు. వారూ స్వయంగా ఉద్రిక్తత ఉన్న ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న హిందూ సమాజానికి ధైర్యం చెప్పారు. పాకిస్తాన్ నుండి శరణార్ధు లాగా వస్తున్న హిందువులు అందరికి శిబిరాలు  నిర్వహించి వారిని ఆదుకోవడం కోసం గురూజీ స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు. దేశం ఎదుర్కొన్న ఈ సమయంలో గురూజీ అద్భుతమైన కర్తృత్వాన్ని ప్రదర్శించారు.

దేశ విభజన తరువాత దేశం లో సామరస్య భావనను సమాజం లో నింపడానికి వారు దేశ‌మంత‌టా పర్యటన చెయ్యడం ప్రారంభించారు. 1948 లో జనవరి 14 న ముంబాయి (అప్పటి బొంబాయి ) లో జరిగిన  ఒక కార్యక్రమంలో దేశంలో భిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో భాగమే వాళ్ళు కూడా  సమాజం కోసం కొన్ని మంచి పనులు, త్యాగాలు చేసి వున్నారు. కాబట్టి వారిని మన స్వంత  సోదరులుగా భావించాల‌ని పిలునిచ్చారు. ఈ రకంగా దేశంలో ఒక వైపు సామరస్య భావనను నింపే ప్రయత్నం జరుగుతుంటే మరో ఉపద్రవం గాంధీజీ  హత్య రూపంలో మన దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. గాంధీ జీ  హత్య తరువాత వెంటనే గురూజీ తన పర్యటనను వెంటనే రద్దు చేసుకొని గాంధీజీ హత్యను ఖండిస్తూ పత్రిక  ప్రకటన ఇచ్చారు. ప్ర‌భుత్వానికి తమ సంతాప సందేశాన్ని పంపించారు. కానీ ప్రభుత్వానికి ఇవేవీ పట్టలేదు. సంఘాన్ని ఎదో పెరుతో అణిచి వేయాలని అనుక్షణం ప్రయతిస్తున్న వారికి గాంధీజీ హత్య ఒక సాకుగా దొరికింది. సంఘంపై నిషేధం విధించారు. ఇదే అవకాశం తీసుకుని సంఘ ఉన్నతిని చూసి ఓర్వలేని శక్తులు అనేక చోట్ల స్వయంసేవకుల పై కార్యాలయాల పై  దాడులు పాల్ప‌డ్డారు. ఇలాంటి సమయంలో గురూజీ స్వయంసేవకులనదరికి be calm at all costs   అని చెప్పారు. గురూజీ ఉన్న ఇంటి పై దాడి చెయ్యడం కోసం కొద్దిమంది దుండగుల వస్తే వారిని ఎదుర్కోవడం కోసం స్వయంసేవకుల లాఠీలు తీసుకుని వస్తే ఈ సమయంలో గురూజీ  గొప్ప మాతృభావంతో “సమాజ సేవ నా జీవిత నినాదం, దాని రక్తపు చుక్క చిందించటానికి నేను కారణము కావడాన్ని నేను అంగీకరించను” కాబట్టి ఏమి జరగనున్నదో అదే జరుగుతుంది మీరు అందరూ వెళ్లి పోండి అని తన రక్షణ కోసం వచ్చిన స్వయంసేవకులను పంపించి వేశారు. ఆ సమయం లో సాక్షాత్తు  గరళాన్ని తన కంఠం లో దాచిన ఆ మహాశివుడు లా వారు కనిపించారు.  చివరకు సంఘం పై నిషేధాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం తొలగించింది. ఈ నిషేధ సమయంలో  గురూజీ కనబర్చిన నేతృత్వం ఆమోఘమైనది.

నిషేధం తొలగిన తరువాత  గురూజీ పర్యటన లో  ఢిల్లీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్న వారిని చూసి BBC ఏమన్నది అంటే గురూజీ ని  భారత దేశం లో మెరుస్తున్న నక్షత్రం గా  అభివర్ణించింది. ఆ సమయంలో దేశం మొత్తంలో జనాలను ఆకర్షించ గలిగే వ్యక్తులు ఇద్దరు మాత్రమే అందులో ఒకటి నెహ్రు రెండవ వారు  గురూజీ లు మాత్రమే.

గురూజీ జాతీయ భద్రత విషయంలో బాగా దూరదృష్టి కలిగి వుండేవారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కశ్మీర్ సమస్యను పరిష్కరించి కాశ్మీరును భారత దేశంలో విలీనం చెయ్యడానికి సర్దార్ పటేల్ గారు  గురూజీ సరి అయిన వ్యక్తి అని వారిని  ప్రత్యేక విమానం లో కాశ్మీరు రాజా హరీష్ సింగ్ దగ్గరికి పంపించారు. కశ్మీర్ భారత దేశం లో కలిసే విధంగా వారు రాజా హరీష్ సింగ్ ను ఒప్పించారు ఈ సమయం లోవారు   చూపిన చాకచక్యం అద్భుతమైనది వారి కృషి ఫలితంగానే నేడు కాశ్మీరు మన దేశం లో ఉన్నది.

చైనా దుందుడుకు స్వభావం, ఆక్రమణ మనస్తత్వం ను ముందునుండే   పసిగట్టారు. అనేక సందర్భాల లో చైనా గురుంచి మన దేశ పాలకులను హెచ్చరించారు. టిబ్బేట్ ను చైనా కు బహుమతి గా ఇవ్వడం చారిత్రక తప్పిదం అనే విషయాన్ని వారు అప్పుడే చెప్పారు. చైనా ఇచ్చే హిందీ చీని భాయి భాయి వెనుక ఉన్న కుతంత్రం గురుంచి ఆ రోజున ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారు హెచ్చరించినట్టుగానే చైనా మన దేశం  పై దాడి చేసి సరిహద్దులలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది. ఆ సమయంలో  గురూజీ స్వయంసేవకులు దేశ ప్రజానీకానికి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించాల‌ని పిలుపునిచ్చారు. ఆ కీలక సమయంలో ప్రభుత్వానికి  మార్గనిర్దేశం, ప్రజలనుండి, స్వయంసేవకుల నుండి మద్దతు పెంపొందించడం లో ఉపయోగపడింది.

 చైనా తో  జరిగిన యుద్ధం లో మనకు కలిగిన పరాభవం నుండి జాతి కోలుకుని ప్రజలలో స్వాభిమానాన్ని నింపడానికి వారు వివేకానంద  రాక్ మెమోరియల్ నిర్మించడం కొరకు దేశ వ్యాప్తంగా ఒక  జాగృతిని తీసుకువచ్చి ఆ నిర్మాణం పూర్తి అయ్యే విధంగా వారు మార్గదర్శనం చేశారు.

పాకిస్థాన్ తో  యుద్ధం జరిగిన సమయంలో ఒకసారి అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఒకనాయకుడు తరుచుగా దేశ ప్రధాని శాస్త్రి జీ తో మన దేశ సైన్యాన్ని YOUR ARMY గా సంబోదిస్తే  అది తప్పు అని  OUR ARMY అని గురూజీ సంభోదించారు. అది మన సైన్యం పట్ల  వారికి ఉన్న  గొప్ప గౌరవ భావం కనబడుతుంది .

వారు సంఘానికి సర్ సంఘచాలక్ గా  33 సంవత్సరాలు పని చేశారు. 67 సంవత్సరాల వారి జీవితంలో సగం కంటే ఎక్కువ సంఘ కార్యానికి సమర్పించారు. రైలు డబ్బానే ఇల్లుగా చేసుకుని దేశాన్ని మొత్తం సంవత్సరంలో 2 సార్లు చొప్పున వారు 66 సార్లు ఆ సేతు హిమాచాలం పర్యటన చేశారు. జాతి హితం కొరకు గురూజీ అనేక ప్రాంతాలలో సంఘకార్యం, అన్ని సామాజిక రంగాలలో సంఘ స్వయంకుల పాత్ర ఉండేలా అనేక రకాల సంస్థలను ప్రారంభించి దేశం మెత్తం పర్యటన చేస్తూ  స్వయంసేవకులకు, వివిధ రంగాలలో పని చేస్తున్న అనేక మంది వ్యక్తులకు, సంస్థలకు నిరంతరం మార్గదర్శిగా వుంటూ ప్రేరణాదాయకుడిగా నిలిచారు. వారి ఆలోచనలు ఇప్పటికి మనకు అందరికి మార్గదర్శకంగా  ఉంటున్నాయి. నిజంగా గురూజీ  రాష్ట్ర ఋషి అని మనం చెప్పుకోవచ్చు.

హే ఋషివర్ శత శత వందన్

త్రిలోక్ , సామాజిక కార్యకర్త