Home News హైదరాబాదులో సోషల్ మీడియా సంగమం

హైదరాబాదులో సోషల్ మీడియా సంగమం

0
SHARE

జాతీయ వాద సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని వర్గాల వారికి చేరవేయడానికి ఏర్పాటు చేయబడిన సమాచార భారతి (సమాచార కేంద్రం) వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాదులో సోషల్ మీడియా యాక్టివిస్టుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.  హైదరాబాదులోని షేక్ పేట లో ఉన్న నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ సదస్సు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రోజంతా జరిగింది.

ఈ కార్యక్రమంలో  డా. పివి రమణ, సెక్యూరిటీ నిపుణులు –  డా. గోపాల రెడ్డి, ఇంటర్నేషనల్ పొలిటికల్ అసోసియేషన్ సభ్యులు – సీనియర్ జర్నలిస్టులు శ్రీ రాకా సుధాకర్, శ్రీ సప్తగిరి, శ్రీ నరేంద్ర చలసాని, శ్రీ సాయి కృష్ణ తో పాటూ సోషల్ మీడియా యాక్టివిస్టులు శ్రీమతి నిహారిక రెడ్డి, శ్రీ ఏ యస్ సంతోష్ లు పాల్గొని సదస్సులో పాల్గొన్న సభ్యులకు మార్గదర్శనం చేశారు.

ముఖ్యంగా నేడు దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలైన ఇస్లామిక్ తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, మహిళల సమస్యలు, వారి రక్షణ, దేశ అంతర్గత భద్రత, సరిహద్దుల రక్షణ తో పాటూ సమాచార హక్కు చట్టం వినియోగం వంటి పలు అంశాలపై నిపుణులు ప్రసంగించడం జరిగింది.  వీటితో పాటూ ప్రస్థుతం దేశంలో తీసుకొని వచ్చిన పౌరసత్వ సవరణ  చట్టంపై అవగాహన కలిపించడం వాటిపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఆయా అంశాలపై ప్రజలలో ఉన్న అపోహలు తొలగించి నిజమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియా ద్వారా ఎలా విస్తృతంగా పని చేయవచ్చనే విషయాన్ని కూడా ఈ సదస్సులో నిపుణులు చర్చించి పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నిపుణులతో పాటూ సమాచార భారతి ప్రధాన కార్యదర్శి శ్రీ ఆయుష్ నడింపల్లి పాల్గొన్నారు.  చివరగా కార్యక్రమంలో హాజరైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు దేశానికి వ్యతిరేకంగా వార్తలు సృష్టించబడుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలు ఛైతన్య పరచాలని పిలుపునిచ్చారు.