దేశానికి స్వరాజ్యం మాత్రమే వచ్చింది స్వతంత్రం ఇంకా రాలేదు. స్వతంత్రం అంటే ఒక జాతికి తనదైన జీవితాన్ని గడుపుతూ మానవాళికి, ప్రపంచానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించేది. కానీ స్వతంత్ర దేశంలో ప్రతీ దానికి ప్రభుత్వంపై ఆధారపడటం మన సమాజానికి నష్ట కారకం. మనసుకు దిశ చూపుతూ హృదయాన్ని మేల్కొలిపే సాహిత్యం ఈ పుణ్య భూమిలో రామాయణం, భారతం, భాగవతం, వేద సాహిత్యం, బౌద్ధ సాహిత్య రూపంలో మనకు అందింది. కాళిదాసు, వేమన, నన్నయ, తిరువళ్ళువర్ వంటి వారి సాహిత్యం సాంస్కృతిక వికాసానికి తోడ్పడిందని యోగి అరవిందులు చెప్పారు. భారతీయ సాహిత్యంలో ఆధ్యాత్మికత, ఆధునికత సమపాళ్ళలో ఉన్నాయి. మన దేశం అఖండమవుతుంది.