Home News శ్రీ దిలీప్ కిషోర్ సహానే క‌న్నుమూత

శ్రీ దిలీప్ కిషోర్ సహానే క‌న్నుమూత

0
SHARE

శ్రీ దిలీప్ కిషోర్ సహానే గారు జనవరి 16న సోమ‌వారం మధ్యాహ్నం 1:45 గంటలకు భాగ్యనగర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయ‌న మ‌హారాష్ట్రలోని పర్భాని జిల్లా హద్‌గావ్‌లో జన్మించారు. అతని తండ్రి కిషోర్ సహానే జీ స్వాతంత్య్ర ఉద్య‌మంలో పోరాటం చేశారు. దిలీప్ కిషోర్ సహానే గారికి ఒక సోదరుడు, 3 సోదరీమణులు ఉన్నారు. వీరు మొద‌ట మహారాష్ట్ర స్టేట్ సీడ్ కార్పోరేషన్‌లో పనిచేశాడు. ఆ త‌ర్వాత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో కూడా ప‌ని చేశారు.

దిలీప్ కిషోర్ సహానే గారు చిన్నతనం నుండి ఆర్‌.ఎస్‌.ఎస్ స్వయంసేవక్. వీరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లోని వివిధ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. మొదట మహారాష్ట్రలోని అకోలాలో, తరువాత భాగ్యనగర్‌లో సంఘ పని చేశారు. గౌలిగూడ నగర‌ కార్యవాహ‌గా, బర్కత్‌పురా భాగ్ కార్యవాహ‌గా, భాగ్యనగర్ విభాగ కార్యకారిణి సదస్యులుగా, తరువాత సహ ప్రాంత‌ గోసేవా ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయ‌నికి భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు.