Home News విద్యార్థి ఉద్య‌మ నాయ‌కుడు మ‌దన్ దాస్ దేవి జీ ఇక‌లేరు

విద్యార్థి ఉద్య‌మ నాయ‌కుడు మ‌దన్ దాస్ దేవి జీ ఇక‌లేరు

0
SHARE
ఆర్‌.ఎస్‌.ఎస్ జేష్ఠ్య ప్ర‌చార‌క్ మాననీయ మదన్ దాస్ దేవి గారు జూలై 24 సోమ‌వారం రోజున బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. మదన్ దాస్ దేవి గారు గ‌తంలో ఏబివిపీ పూర్య సంఘ‌ట‌న కార్య‌ద‌ర్శిగా, ఆర్‌.ఎస్‌.ఎస్ స‌హా స‌ర్ కార్య‌వాహ‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.
మదన్ దాస్ దేవి గారు విద్యార్థి పరిషత్ యాత్రలో దేదీప్యమానమైన ధ్యేయయాత్రిగా నిలిచారు. విద్యార్థి శక్తిని జాతీయ శక్తిగా మలచడంలో ఎంతో వారు కుశల సంఘటకుడిగా నిలిచారు. విద్యార్థి పరిషత్ సంస్థాపనా దినమైన 9 జూలై వారి జన్మదినం  అవ్వడం ఈశ్వర ప్రేరితమైనది.
మదన్ దాస్ గారు మహారాష్ట్రలోని సోంపూర్ జిల్లాలోని కరమాల గ్రామానికి చెందినవారు. పాఠశాల విద్య అనంత‌రం ఉన్నత విద్య కోసం వారు 1959లో పూణేలోని బిఎంసిసి కళాశాలలో చేరారు. ఎంకామ్ పూర్త‌య్యాక ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాల నుంచి LLB లో గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం వారు పూణేలో CA చదువుతున్న సమయంలో శ్రీ శుక్లాదాస్ దేవి గారి ప్రేరణతో సంఘ కార్యానికి పరిచితమయ్యారు.
1964లో ముంబైలో విద్యార్థి పరిషత్ కార్యాన్ని స్వీకరించారు. 1966 లో విద్యార్థి పరిషత్ ముంబై నగర కార్యదర్శిగా బాధ్యత స్వీకరించారు. 1968లో కర్ణావతిలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ మహాసభలలో మదన్ జీ పూర్తి సమయ కార్యకర్తగా పశ్చిమాంచలక్షేత్రీయ సంఘటనా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
1970 లో తిరువనంతపురంలో జరిగిన జాతీయ మహాసభలలో జాతీయ సంఘటనా కార్యదర్శిగా బాధ్యతను స్వీకరించారు. 1970 నుంచి 1992 వరకు 22 సంవత్సరముల పాటు విద్యార్థి పరిషత్ రాష్ట్రీయ సంఘటన కార్యదర్శిగా సంపూర్ణ భారత దేశ పర్యటన చేశారు సంపూర్ణ భారత దేశంలో తాలూకా – నగర స్థాయిలలో సంస్కారవంతులైన కార్యకర్తల సమూహాన్ని తయారు చేయడంలో విశేషమైన ప్రయత్నం చేశారు. ఏబీవీపీ పేరుకు తగ్గట్టుగా అఖిలభారత స్థాయిలో నిలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది సమర్పిత కార్యకర్తలను తయారు చేయడంలో మహత్వ భూమికను పోషించారు. 1991లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అఖిల భారత సహప్రచార ప్రముఖ్ బాధ్యత స్వీకరించి అనంతరం 1993లో సంఘ సహ సర్ కార్యవాహ్ బాధ్యతని కూడా నిర్వర్తించారు.
మదన్ జీ మృతి ప‌ట్ల ఆర్‌ఎస్‌ఎస్ స‌ర్ కార్య‌వాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బెంగుళూరులో భౌతిక కాయానికి పూలు స‌మ‌ర్పించి నివాళుల‌ర్పించారు.