Home Ayodhya శ్రీ రామజన్మభూమి దేవాలయ చరిత్ర

శ్రీ రామజన్మభూమి దేవాలయ చరిత్ర

0
SHARE

– శ్రీ రామచంద్రుడు స్వర్గారోహణం చేసినప్పుడు అయోధ్యలోని భవనాలు, దేవాలయాలు సరయూలో మునిగిపోయాయని, చాలాకాలం ఆ ప్రాంతం బీడుపడి ఉందని శాస్త్రగ్రంధాలు చెపుతున్నాయి.

– ఆ తరువాత కొంత కాలానికి కుశావతి(కౌశాంబి)ని పాలించిన మహారాజ కుశుడు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని స్థాపించాడని కాళిదాసు తన రఘువంశం అనే కావ్యంలో పేర్కొన్నాడు.

– మహారాజ కుశుడు శ్రీ రామజన్మభూమిలో ఒక భావ్యమైన మందిరాన్ని కట్టించాడని లోమశ రామాయణం చెపుతోంది.

– జైన గ్రంధాల ప్రకారం శిధిలమైన అయోధ్యను ఋషభదేవుడు పునరుద్ధరించి, ఆవాసయోగ్యంగా మార్చాడు.

– ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు `మోక్షదాయిని సప్తపురి’ అని పేరుపడిన ఏడు పుణ్య నగరాలను నిర్మించాడు. వాటిలో అయోధ్య ఒకటి. రాజా విక్రమాదిత్యుడు క్రీ.పూ 57లో ఉజ్జయిని సింహాసనాన్ని అధిష్టించాడు. ఆనాటి నుంచి విక్రమ శకం ప్రారంభమయింది.(భవిష్యపురాణం)

– విక్రమాదిత్యునికంటే ముందు మరోసారి అయోధ్యా నగరం బీడు పడింది. లక్ష్మణ ఘాట్ చుట్టూ 360 దేవాలయాలను ఆయన నిర్మించి నగరాన్ని పునరుద్ధరించాడు. రామకోట్ ను రామజన్మభూమిగా గుర్తించాడు. అలాగే నాగేశ్వరనాథ్ దేవాలయం, మానిపర్వతం, మొదలైన ప్రదేశాలను విక్రమాదిత్యుడు అభివృద్దిచేశాడు.

– విష్ణుభక్తుడైన విక్రమాదిత్యుడు విష్ణుపాద పర్వతంపై విష్ణు ధ్వజాన్ని స్థాపించాడు. అలాగే రామజన్మభూమిలో భావ్యమైన దేవాలయాన్ని నిర్మించాడు.

– శ్రీ రామజన్మభూమిపై సాలార్ మసూద్ దురాక్రమణ, రాజ సుహేలదేవుని చేతిలో పరాజయం

– క్రీ..శ. 1033లో సాలార్ మసూద్ సాకేత నగరం (అయోధ్య)పై దాడి చేశాడు. పునర్నిర్మించిన జన్మభూమి దేవాలయాన్ని మళ్ళీ ధ్వంసం చేశాడు.

– తిరిగి వెళుతున్నప్పుడు సాలార్ మసూద్ సేనలను బహరైచ్ దగ్గర రాజా సుహేలదేవుడు అడ్డగించాడు. 14జూన్, 1033న జరిగిన ఘోర యుద్ధంలో సుహేలదేవుడు మసూద్ సేనల్ని చిత్తుగా ఓడించాడు. యుద్ధంలో మసూద్ మరణించాడు.

– ఈ యుద్ధం దురాక్రమదారుల్లో ఎంత భయాన్ని కలిగించిందంటే ఆ తరువాత చాలాకాలంపాటు ఎవరు భారత్ వైపు కన్నెత్తి చూడలేదు.

– ఘర్వాల్ రాజులు జన్మభూమి దేవాలయాన్ని తిరిగి కట్టించారు.

అయోధ్య పై బాబర్ దురాక్రమణ

– క్రీ.శ. 1526లో బాబర్ అయోధ్యకు వచ్చాడు. మొత్తం భారతదేశాన్ని జయించాలని కలలుగన్నాడు.

– హిందూ వీరుల ధైర్యాన్ని దెబ్బతీయడానికి శ్రీ రామజన్మభూమిలోని మందిరాన్ని ధ్వంసం చేయాలని ఒక మతగురువు అతనికి సలహా ఇచ్చాడు.

– ఆ సలహా ప్రకారం రామమందిరాన్ని ధ్వంసం చేయాలని బాబర్ తన సైన్యాధ్యక్షుడైన మీర్ బాకీని ఆజ్ఞాపించాడు.

– 1528లో మందిరాన్ని కూల్చి అక్కడే మసీదు నిర్మించాలని మీర్ బాకీ ప్రయత్నించాడు. కానీ స్థానిక హిందువుల గట్టి ప్రతిఘటన మూలంగా మసీదు నిర్మించలేకపోయాడు.

– అందుకనే బాబ్రీ కట్టడంలో ఎలాంటి మీనార్ లు, వజూ (నమాజు చేసే ప్రదేశం) కనిపించవు. కనుక అది కేవలం ఒక కట్టడం మాత్రమే. మసీదు కాదు.

– కట్టడం బయట ఒక రాతిపై పర్షియా భాషలో `దేవతలు దిగే ప్రదేశం’ అని చెక్కి ఉంది. దీనిని బట్టి అది జమ్మభూమి అని స్పష్టమవుతోంది.

– మరొక చోట `సీతా కి రసోయి’ (సీత వంటిల్లు) అని వ్రాసి ఉంది. నిరంతర దాడులు, పోరాటాల మూలంగా అయోధ్యలో చాలా ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి.