Home News అయోధ్య తీర్పుపై అన్నిరివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్ట్

అయోధ్య తీర్పుపై అన్నిరివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్ట్

0
SHARE

గత నవంబర్ 9న అయోధ్య తీర్పు వెలువడగా, అయోధ్య తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్ట్ ఈ రోజు కొట్టివేసింది.

నవంబర్ 9న, 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి వీలుగా రామ్ లల్లాకు కేటాయించాలని సుప్రీం కోర్ట్  తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అయితే ఈ తీర్పును సమీక్షించాలంటూ.. డిసెంబర్ 2న సుప్రీంలో తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. జమయత్ ఉలామా ఇ హింద్ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 6న ఆరు రివ్యూ పిటిషన్లు, డిసెంబర్ 9న మరో రెండు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.
డిసెంబర్ 9న అఖిల భారత్ హిందూ మహాసభ, మరో 18 మంది వ్యక్తులు అయోధ్య తీర్పులో కొంత భాగాన్ని  సమీక్షించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

డిసెంబర్ 9న అఖిల భారత్ హిందూ మహాసభ, మరో 18 మంది వ్యక్తులు అయోధ్య తీర్పులో కొంత భాగాన్ని  సమీక్షించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

అయోధ్య తీర్పుపై అఖిల భారత హిందూ మహాసభ పరిమిత రివ్యూను కోరింది. అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించడాన్ని హిందూ మహాసభ ఖండించింది.

ఈ సందర్భంలో రామమందిర నిర్మాణానికి వివాదాస్పద భూమిని, సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయ స్థలంలో ఐదు ఎకరాల భూమిని ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరిన 18 పిటిషన్లను సిజెఐ బొబ్డేతో పాటు జస్టిస్ డి వై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్, సంజీవ్ ఖన్నాఎల్‌ఏ‌టి‌ఓ కూడిన ధర్మాసనం కొట్టివేసింది. దీనితో రామమందిర నిర్మాణానికి మార్గం మరింత సుగమమైంది.