నిషేధిత ఐఎస్ఐఎస్ మరియు అల్-ఖైదా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన ఘటన కేరళలో తిరువనంతపురం జిల్లా వర్కాలలోని సిహెచ్ ముహమ్మద్ కోయా మెమోరియల్ కళాశాలలో చోటుచేసుకుంది.
ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలు కలిగివున్న కొందరు విద్యార్థులు కళాశాల ఆవరణలో చేపట్టిన ర్యాలీలో తీవ్రవాద సంస్థలకు చెందిన జెండాలు ఎగురవేయడంతో పాటు మద్దతుగా నినాదాలు కూడా చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కేరళకు చెందిన జనం టీవీ ఛానెల్ విడుదల చేసిన వీడియో ఫుటేజీల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టెర్రరిస్టుల వేషధారణలో విద్యార్థులు తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను కీర్తించడం వంటి ఘటనలను కూడా జనం టీవీ ఛానెల్ ప్రసారం చేసింది.
@TVJanam released visuals of college students rallying in solidarity with terrorist organisations like ISIS& Al-Qaeda and graffiti glorifying Osama bin Laden on a college campus in Varkala, Tvm. Students spotted wearing ‘terrorist costumes’ in the video.https://t.co/isDKt75rwK pic.twitter.com/JnMgYuy1td
— J Nandakumar (@kumarnandaj) December 29, 2018
ఘటన జరిగి 2 నెలలు గడుస్తున్నట్టు తెలుస్తున్నా కళాశాల యాజమాన్యం మాత్రం ఘటనలో పాలుపంచుకున్నవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
తాజాగా విడుదలైన వీడియోల ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాయి. కేరళ రాష్ట్ర పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఐజీ మనోజ్ అబ్రహం ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్టు డీజీపీ లోకనాథ్ బహ్రా తెలిపారు.
Source: Organiser