Home News తెలంగాణా లో విస్తరిస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు

తెలంగాణా లో విస్తరిస్తున్న ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ శాఖల సంఖ్య గత 5-6 సంవత్సరాలుగా దేశమంతటా పెరుగుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం శాఖల సంఖ్య 57233కు చేరుకుంది. ఇవి 36693 స్థలాల్లో నడుస్తున్నాయి. సాప్తాహిక్‌ మిలన్‌ (వారానికి ఒకసారి), సంఘ మండలి కూడా కలుపుకుంటే మొత్తం 59136 స్థలాల్లో సంఘ పని జరుగుతోంది అని తెలంగాణా ప్రాంత కార్యవహ శ్రీ ఎక్కా చంద్రశేకర్ జి తెలిపారు.

ఈ రోజు కేశవ నిలయం బర్కత్ పుర లో జరిగిన పత్రిక విలేఖరుల సమావేశంలో శేకర్ జి మాట్లాడుతూ 19-21 మార్చ్‌, 2017 కోయంబత్తూరులో నిర్వహించబడిన ఆర్ఎస్ఎస్ అఖిలభారతీయ ప్రతినిది  సమావేశాల వివరాలు మీడియా కు అందచేసారు.

ప్రస్తుతం  దేశ వ్యాప్తంగా స్వయంసేవకులు 1,70,700 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణాలు లో 1108 కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తెలంగాణా రాష్ట్రంలో 1495 స్థలాల్లో 2302 శాఖలు, 370 సాప్తాహిక్‌ మిలన్‌లు జరుగుతున్నాయి. వాటిని ఈ సంవత్సరం లో ౩౦౦౦ వారకు చేర్చే లక్ష్యంగా యోజన బద్దంగా పని చేస్తున్నాము అని అన్నారు.

విజయదశమి సందేశంలో సర్‌సంఘచాలక్‌జీ ఇచ్చిన పిలుపు మేరకు హిందువులందరికీ దేవాలయ ప్రవేశం, ఒకే స్మశానం, ఒకేచోట నీరు పట్టుకునే వ్యవస్థ ఉండేట్లుగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కార్యకర్తలు 10 జిల్లాల్లో విస్తృత సర్వే చేపట్టారు. 527 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి వివరాలు నమోదు చేశారు. ఇప్పటికీ వివక్ష ఉన్నటువంటి గ్రామాల్లో సమస్యని పరిష్కరించే దిశగా గ్రామపెద్దలతో మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో కొందరు సామూహిక స్మశానవాటిక కోసం తమ భూముల్ని కూడా ఇవ్వడం విశేషం. అయితే ఈ విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని దానికి అనుగణంగా స్వయంసేవకులు కార్యక్రమాలు యోజన జరుగుతుంది అని అన్నారు.

ఇటీవల కాలంలో, స్వయసేవకులు హైదరాబాద్ లో చేపట్టిన వివేక్ బ్యాండ్, సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో నిర్వహించిన వివిధ కార్యక్రమలో 15 వేల మందికి పైగా ప్రజలు పాల్గొని విజయవంతం చేసారు.

తెలంగాణా ప్రాంత సంఘచాలక్ శ్రీ పి వెంకటేశ్వర్ రావు గారు ఈ పత్రిక సమావేశంలో మాట్లాడుతూ సంఘ విస్తరణకై జరుగుతున్న వివిధ కార్యక్రమాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు అని, ఎంతో ఉత్సాహంతో  పాల్గొనడం ఒక మంచి పరిణామం అన్నారు.

ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ అఖిలభారతీయ ప్రతినిది  సమావేశాలలో సమర్పించిన వార్షిక నివేదిక విడుదల చేసారు.

ఆర్ ఎస్ ఎస్ వార్షిక నివేదిక

అఖిలభారతీయ ప్రతినిది సభలో దేశంలో పేరుగుతున్న జిహాది ఉగ్రవాదం పై ఆందోళన తెలియచేస్తూ వెస్ట్ బెంగాల్ లో పెరుగుతున్న జిహాది కార్యకలాపాలు –జాతీయ ప్రయజనాలకు పెను సవాలు అనే తీర్మానాన్ని సైతం అందచేసారు.

ఆర్ఎస్ఎస్ అఖిలభారతీయ ప్రతినిది  సమావేశాల తీర్మానం