Home News VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు”

VIDEO: కేర‌ళ వ‌న‌వాసీ వీరుడు “తలక్కల్ చందు”

0
SHARE

ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ వీరులు అడ్డుకట్ట వేశారు. ఈ వీరులకు కేరళలోని కొట్టాయంకు చెందిన వీర కేరళ వర్మ పళాసీ రాజా సాయం చేశాడు. వారి సహాయంతో స్థానిక గిరిజన వీరుడు తలక్కల్ చందు గెరిల్లా యుద్ధ రీతిలో బ్రిటిషర్లను గజగజలాడించాడు. ఈ వీరుడి సాహసాన్ని వర్ణించే అనేక పాటలు ఇప్పటికీ అక్కడి జానపదులు పాడుకుంటూ ఉంటారు.