Home Telugu Articles లవ్ జిహాద్ బాధిత బాలికల కేసు దర్యాప్తుకు ఆదేశించిన జాతీయ బాలల హక్కుల కమిషన్

లవ్ జిహాద్ బాధిత బాలికల కేసు దర్యాప్తుకు ఆదేశించిన జాతీయ బాలల హక్కుల కమిషన్

0
SHARE

కొచ్చి: కేరళ రాష్ట్రంలో  బాలికలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న లవ్ జిహాద్ ఘటనలపై దర్యాప్తు చేపట్టాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని క్రైస్తవ మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రేమ పేరిట ఉచ్చులోకి దింపి, వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నదని, ఈ కార్యకలాపానికి స్వస్తి పలకాల్సిందిగా ‘కేరళ పీపుల్స్ ఫ్రంట్’ సంస్థ జాతీయ బాలల హక్కుల కమిషన్ను ఆశ్రయించింది.

https://twitter.com/KeralaFront/status/1217699329038675969

కేరళ పీపుల్స్ ఫ్రంట్ సంస్థకు చెందిన సామాజిక కార్యకర్త విపిన్ మీనన్ చేసిన ఫిర్యాదుకు జాతీయ బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కేరళ పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా ఘటనలపై తీసుకున్న చర్యల నివేదికను 10 రోజుల్లో తమకు సమర్పించాల్సిందిగా కేరళ డిజిపిని కోరింది. 

Also Read:Love Jihad: Women converted into Islam in Kerala, husband plans to sell her to Islamic State terrorists

బాలికలను ఇస్లాం మతంలోకి మార్చి, వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించుకోవటానికి అమాయక బాలికలను ప్రేమ పేరుతో మోసం చేయడం, శారీరకంగా దోచుకుని వాటినన్నింటినీ విజువల్స్ రికార్డ్ చేయడం ద్వారా లవ్ జిహాద్ చేయడం ఉంటుంది. అయితే పోలీసులు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు.

https://twitter.com/KeralaFront/status/1222205984325754880

SOURCE: NEWS BHARATI