Home Videos VIDEO: ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నం – తిల్కా మాంఝి

VIDEO: ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నం – తిల్కా మాంఝి

0
SHARE

బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌ కు చెందిన తిల్కా సంతాలీ ఆదివాసీ తెగకు చెందినవాడు. ఈస్టిండియా కంపెనీ దురాక్రమణ మూలంగా అడవిబిడ్డల జీవనం అతలాకుతలమయ్యింది. పన్ను వసూలు అధికారం పేరుతో అటవీ భూములు బయటి వ్యక్తులకు అప్పగించేది కంపెనీ. కంపెనీ వైఖరికి నిరసనగా ఉద్యమం మొదలైంది. భాగల్పూర్, సుల్తాన్‌గంజ్‌ ప్రాంత ఆదివాసీలంతా తిల్కా నాయకత్వంలో ఉద్యమం సాగించారు. కేవలం విల్లంబులు మాత్రమే ఉన్న వనవాసులు ఆధునిక ఆయుధాలు కలిగిన బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడినా ఎక్కువకాలం నిలువలేకపోయారు. చివరికి వనవాసులకు నాయకత్వం వహిస్తున్న తిల్కా మాంఝిని పట్టుకున్న బ్రిటిష్ సైన్యం అత్యంత క్రూరంగా హింసించి చివరికి ఉరి తీసింది.