Home News సామాన్యులకు సామాజిక భద్రత కల్పనలో మూడు పథకాల ముందడుగు

సామాన్యులకు సామాజిక భద్రత కల్పనలో మూడు పథకాల ముందడుగు

0
SHARE

– వేదిక జన్వర్

పెద్ద సంఖ్యలో మహిళలు నమోదు చేసుకునే క్రమంలో ఈ పథకాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2021నాటికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు 13 కోట్ల 68 లక్షల మందికి పైగా మహిళా లబ్దిదారులు నమోదు చేసుకున్నారు

దేశప్రజలకు సామాజిక భద్రతను కల్పించడంలో కీలక పాత్ర పోషించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY), అటల్ పింఛను యోజన (APY) పథకాలు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి.

ఈ పథకాలను పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 2015 సంవత్సరం మే తొమ్మిదవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో బీమా, భద్రత కల్పించడంలో ఈ పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

అనూహ్యమైన ముప్పులు లేదా ఆర్థిక నష్టాలు, ఆర్థికపరమైన అనిశ్చితుల నుంచి మానవ జీవితానికి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. సామాజిక భద్రతకు ఉద్దేశించిన ఈ మూడు పథకాలను దేశ పౌరుల సంక్షేమానికి అంకితం చేసింది. దేశంలో అసంఘటిత వర్గానికి చెందిన ప్రజలకు ఆర్థిక భద్రత దిశగా PMJJBY, PMSBY పథకాలు అమలవుతున్నాయి. అదే వర్గానికి చెందిన వృద్ధులకు అండగా APY పథకం సేవలందిస్తున్నది.

పెద్ద సంఖ్యలో మహిళలు నమోదు చేసుకునే క్రమంలో ఈ పథకాలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. 2021నాటికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలకు 13 కోట్ల 68 లక్షల మందికి పైగా మహిళా లబ్దిదారులు నమోదు చేసుకున్నారు.

దేశ ప్రజలకు భద్రత, బీమాను సులువుగా సమకూర్చే స్తంభాలుగా వ్యవహరిస్తున్న ఈ పథకాలు, వాటి ప్రయోజనాలను సమగ్రంగా తెలుసుకుందాం.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)

ఏడాది కాలానికి ప్రమాద బీమా పథకంగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే విధంగా అమలవుతున్న PMSBY పథకం ప్రమాదం జరిగినప్పుడు మరణం లేదా అంగ వైకల్యానికి కవరేజ్ ఇస్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులతో అనుసంధానమైన ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బీమా కంపెనీలు ఈ పథకాన్ని అర్హులకు వర్తింపజేస్తున్నాయి.

18 నుంచి 70 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఏదేనీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న వ్యక్తులు ఈ పథకానికి నమోదు చేసుకోవడానికి అర్హులు. వార్షిక ప్రీమియంగా చెల్లించాల్సిన 12 రూపాయలు మొత్తం ప్రతి ఒక్క సభ్యుని అకౌంట్ నుంచి అయాచితంగా డెబిట్ అవుతుంది. ఈ పథకంలో పాల్గొనేలా బలహీన వర్గాల ప్రజలను ప్రోత్సహించే దిశగా నామ మాత్రపు ప్రీమియం మొత్తాన్ని విధించారు.

ప్రమాదంలో మరణం లేదా అంగవైకల్యం జరిగినప్పుడు రెండు లక్షల రూపాయల ప్రమాదంలో మరణం, అంగవైకల్యం కవరేజ్ ఉంటుంది. పాక్షిక అంగవైకల్యానికి లక్ష రూపాయల కవరేజ్ ఉంటుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ నాటికి PMSBY కింద 28 కోట్ల 37 లక్షల మందికి పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు. 97 వేల 227 క్లెయిమ్‌ల రూపేణా 1,930 కోట్ల రూపాయలను లబ్దిదారులకు చెల్లించారు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)

ఏడాది కాలానికి జీవిత బీమా పథకంగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే విధంగా అమలవుతున్న ఏ కారణం చేత మరణం సంభవించినప్పటికీ కవరేజ్ ఇస్తుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులతో అనుసంధానమైన ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బీమా కంపెనీలు ఈ పథకాన్ని అర్హులకు వర్తింపజేస్తున్నాయి.

18 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఏదేనీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న వ్యక్తులు ఈ పథకానికి నమోదు చేసుకోవడానికి అర్హులు. మరికొద్ది కాలంలో 50 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుంటారనగా ఈ పథకంలో చేరిన వారు ప్రీమియం‌ను క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా 55 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు రిస్క్ ఆఫ్ లైఫ్ కవరేజ్‌ను పొందుతారు.

కేవలం 330 రూపాయల వార్షిక ప్రీమియంను చెల్లించడం ద్వారా ఏదేనీ కారణంతో మరణం సంభవించినప్పుడు రెండు లక్షల రూపాయల లైఫ్ కవర్ ఉంటుంది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న వారి సంఖ్య 12 కోట్ల 76 లక్షల మందికిపైగా ఉంది. 5,76,121 క్లెయిమ్‌లకు గాను రూ.11,552 కోట్ల రూపాయలను లబ్దిదారులకు చెల్లించారు.

అటల్ పింఛను యోజన (APY)

దేశ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఒక సార్వత్రిక సామాజిక భద్రత వ్యవస్థను సృష్టించే దిశగా అటల్ పింఛను యోజన (APY) ఆరంభమైంది.

జాతీయ పింఛను వ్యవస్థ (NPS) కు చెందిన యావత్ పరిపాలన సంబంధిత, సంస్థాగత నిర్మాణానికి లోబడి పింఛను నిధి నియంత్రణ మరియు అభివృద్ధి అథార్టీ (PFRDA) ద్వారా అసంఘటిత రంగానికి చెందిన ప్రజలకు ఆర్థిక భద్రత, భవిష్యత్ అవసరాలను కవర్ చేసే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది.

18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఏదేనీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారందరికి APY పథకం వర్తిస్తుంది. ఖాతాదారు తాను ఎంచుకున్న పింఛను మొత్తాన్ని బట్టి చెల్లింపు ఉంటుంది. పథకంలో చేరిన తర్వాత ఖాతాదారు చేసే చెల్లింపు మేరకు అతడు లేదా ఆమెకు 60 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000 లేదా రూ.5,000 వరకు ప్రతి మాసం పింఛను పొందుతారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి 99 లక్షలకు పైగా APY ఖాతాలు నమోదయ్యాయి. 2022 సంవత్సరం మార్చి మాసాంతానికి మొత్తం ఖాతాదారుల సంఖ్య 4 కోట్ల ఒక లక్షకు పైగా ఉందని PFRDA వెల్లడించింది.

ఖాతాల నమోదులో దాదాపు 71 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) ద్వారా జరిగింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) ద్వారా 19 శాతం, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల ద్వారా ఆరు శాతం, పేమెంట్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs) ద్వారా మూడు శాతం ఖాతాలు నమోదయ్యాయి.

APY పథకం కింద బీహార్, జార్ఖండ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు (SLBCs) వార్షిక లక్ష్యాలను సాధించాయి. ఖాతాదారుల్లో 44 శాతం మంది మహిళలు కాగా పురుషులు 56 శాతంగా ఉన్నారు. APY ఖాతాదారుల్లో 45 శాతం మంది 18 నుంచి 25 సంవత్సరాల లోపువారు కావడం విశేషం.

‘ఆర్గనైజర్’ సౌజన్యంతో..