క్రైస్తవ యువతిని ప్రేమించి, మతం మార్చుకోవడానికి నిరాకరించినందుకు ఒక గిరిజన యువకుడిని స్థానికంగా ఉండే కొన్ని చర్చిలకు చెందిన వారు దారుణంగా హత్య చేసిన ఘటన అస్సాంలోని లఖింపూర్ జిల్లాలోని కోయిలమారి బలిజన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… బికి బిషాల్ (23) అనే గిరిజన యువకుడు ఒక క్రిస్టియన్ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి అతని ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసున్న స్థానికంగా ఉండే 3 చర్చిల వారు ఆ యువకుడి ఇంటికి గుంపుగా వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. వారు ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకువెళ్లి, అబ్బాయికి క్రైస్తవ మతంలోకి మారాలని లేదంటే ఆ అమ్మాయిని విడిచిపెట్టాలని బెదిరించారు.
క్రైస్తవ మతంలోకి మారాలనే వారి ప్రతిపాదనను బిషాల్ తిరస్కరించాడు. దీంతో కోపోద్రిక్తులైన గుంపు అతని ఇంటిని ధ్వంసం చేసింది. ఆ తర్వాత అతనిపై కర్రలతో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత చెట్టుకు వేలాడాదీశారు.
లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ అనే మానవ హక్కుల సంస్థ ఈ విషయాన్ని గ్రహించి ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసుల అధికారులను కోరింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాకు చెందిన గిరిజన బాలిక చెట్టుకు వేలాడుతూ కనిపించిన కొద్ది రోజులకే బికీ బిషాల్‌ను కొట్టి చంపడం దారుణమైన విషయం. 14 ఏళ్ల గిరిజన బాలికపై అర్మాన్ అన్సారీ అనే వ్యక్తి అత్యాచారం చేసి చెట్టుకు ఉరివేసాడు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
#Assam Hindu youth Biki Bishal pulled out of home n killed for marrying #Christian girl n refusing to get convert at Koilamari Balijan- Johing, Lakhimpur @lakhimpurpolice! Mob of 1000 plus goons mobilized by 4 #Baptist Churches in locality! @assampolice @himantabiswa @AssamCid pic.twitter.com/ejc8bngc4i
— Legal Rights Observatory- LRO (@LegalLro) September 14, 2022