‘నమాజ్’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో రాజస్థాన్ లోని అజ్మీర్ కు వెళ్తూ రాత్రిపూట దారిలోని షాజహాన్‌పూర్ గ్రామానికి చేరుకున్నారు. తమ బస్సును రోడ్డుకు అడ్డంగా నిలిపివేసి, రోడ్డుపైనే నమాజ్ చేయసాగారు. ‘నమాజ్’ పేరిట రోడ్డును ఆక్రమించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు స్థానిక విశ్వహిందూ పరిషద్ కార్యకర్తల సహాయంతో వారిని నేరుగా తిల్హార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు
యాత్రికులు బస్సును రోడ్డు అడ్డంగా నిలిపి, ‘నమాజ్’ పేరిట రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన ఘటనలో 18 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారు లిఖితపూర్వక క్షమాపణ చెప్పడంతో చలాన్ జారీ చేసి విడుదల చేశామని అదనపు ఎస్పీ సంజీవ్ వాజపేయి తెలియజేసారు.