జమ్ముకాశ్మీర్ కిష్టవార్ లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సహ సేవ ప్రముఖ్ శ్రీ చంద్రకాంత్ జీ, ఆయన అంగరక్షకుడు ఒక ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నేలకొరగడం తీవ్ర సంతాపాన్ని కలిగించింది. ఉగ్రవాదుల ఈ పిరికిపంద చర్యను ఆర్ ఎస్ ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. కిష్టవార్ దోడా ప్రాంతంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో చంద్రకాంత్ జీ ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే జాతీయ శక్తులకు పెద్ద అండగా నిలిచారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ లోని హిందూ సమాజానికి, దేశభక్తులకు ఇది పెద్ద లోటు. అమరులైనవారి ఆత్మకు శాంతి కలగాలని, బాధిత కుటుంబాలకు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాము. ఈ బలిదానం వ్యర్ధంగా పోదని, ఉగ్రవాదంపై పోరును కొనసాగించి, విజయం సాధించడానికి స్వయంసేవకులతోపాటు మిగతా సమాజానికి కూడా ప్రేరణను ఇస్తుందని భావిస్తున్నాము. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన వారిని సాధ్యమైనంత త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
– సురేశ్ (భయ్యాజీ) జోషి , సర్ కార్యవాహ , ఆర్ ఎస్ ఎస్