Home News జలియన్ వాలా బాగ్ మారణహోమంలో అమరులైన దేశభక్తులను స్మరిస్తూ చిన్నారుల నివాళులు

జలియన్ వాలా బాగ్ మారణహోమంలో అమరులైన దేశభక్తులను స్మరిస్తూ చిన్నారుల నివాళులు

0
SHARE
స్వతంత్ర సంగ్రామం సందర్భంగా జలియన్ వాలా బాగ్ మారణహోమంలో బలైన వేల మంది భారతీయులను స్మరిస్తూ మెదక్ శిశుమందిర్ చిన్నారులు నివాళులర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన ఈ మారణకాండకు  నూరేళ్ళు పూర్తైన సందర్భంగా పోలీసుల కాల్పుల్లో అమరులైన దేశ భక్తుల త్యాగాలను స్మరించుకున్న చిన్నారులు, ఈ సందర్భంగా ‘వంద’ సంఖ్య ఆకారంలో జ్యోతులను పేర్చి నివాళులర్పించారు.
13 ఏప్రిల్ 1919  దేశ చరిత్రలో మరిచిపోలేని రోజు. అమృతసర్ లోని జలియన్ వాలా బాగ్ లో శాంతియుతంగా సమావేశమైన భారతీయులపై బ్రిటీష్ పోలీసులు జరిపిన కాల్పుల్లో వేయ్యి మందికిపైగా  భారతీయులను మృతిచెందారు. ఈ దారుణ హింసాకాండకు శనివారం నాటికి నూరేళ్ళు పూర్తవుతుంది.
ఈ మారణహోమంతో భారత స్వతంత్ర్య సంగ్రామం కొత్త మలుపు తిరిగింది. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర్య పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది.
శిశుమందిర్ విద్యార్థులు ఈ సందర్భంగా జలియన్ వాలాబాగ్ దురంతం తాలూకు ఘట్టాలను వివరించే చార్టులను ప్రదర్శించారు. పాఠశాల కార్యదర్శి మత్స్యేంద్రనాథ్, ప్రధానాచార్యులు సుధారాణి జలియన్ వాలా బాగ్ దురంతం గురించి విద్యార్థులకు వివరించారు.