Home News యూపీ: మ‌త మార్పిడికి పాల్ప‌డిన వ్య‌క్తి అరెస్టు

యూపీ: మ‌త మార్పిడికి పాల్ప‌డిన వ్య‌క్తి అరెస్టు

0
SHARE

హిందూ యువ‌తిని బ‌ల‌వంతంగా వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మార్చిన వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బారాబంకి జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే బ‌రాబంకి జిల్లాకి చెందిన వ‌హాబ్‌(31) అనే వ్య‌క్తి గ‌తేడాది దేశ‌రాజ్ గౌత‌మ్‌గా పేరు మార్చుకుని అదే జిల్లాలోని ఒక రైతు వ‌ద్ద కొంత వ్యవసాయ భూమిని లీజుకి తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో వ‌హీబ్ రైతు కుమార్తె ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు వ్య‌క్తిగ‌త చిత్రాల‌ను వీడియో తీశాడు. ఆ వీడియోల‌ను అడ్డంపెట్టుకుని ఆ యువ‌త‌ని బెదిరించ‌డం ప్రారంభించాడు. త‌నను వివాహం చేసుకోవాల‌ని లేదంటే త‌న‌ వ‌ద్ద వీడియోల‌ను బ‌హిరంగం చేస్తాన‌న‌ని బెదిరించాడు. చివ‌రికి ఆమెను బ‌ల‌వంతంగా వివాహం చేసుకుని సిమ్రాన్ గా ఆమె పేరు మార్చాడు.

ఈ విష‌యంపై బాధితురాలి తండ్రి (రైతు) పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా మ‌త మార్పిళ్ల వ్య‌తిరేక చ‌ట్టం కింద వ‌హాబ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్న‌ట్టు స్థానిక జిల్లా పోలీసు అధికారి అవధేశ్ సింగ్ తెలిపారు.

గతేడాది నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మత మార్పిడులకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ప్రకటించింది. జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా వివాహం చేసుకుని మతమార్పిడికి పాల్ప‌డ‌టం చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించ‌డ‌మే అవుతోంద‌న్న‌ది ఈ ఆర్డినెన్సు ఉద్దేశం. ఈ మేర‌కు బ‌ల‌వంత‌పు వివాహం చేసుకుని యువ‌తిని మ‌తం మార్చిన వ‌హబ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.