హిందూ సంఘాల నాయకులే లక్ష్యంగా, వసంత పంచమి రోజున దాడికి కుట్ర పన్నిన ఇద్దరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి.ఎఫ్.ఐ) ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది. ఈ సందర్భంగా యుపి లా అండ్ ఆర్డర్ ఎడిజి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ కేరళకు చెందిన అన్సాద్ బద్రుద్దీన్, ఫిరోజ్ ఖాన్ అనే ఇద్దరు పి.ఎఫ్.ఐ సభ్యులు వసంత పంచమి రోజున హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకుని భారీ ఉగ్రదాడికి పన్నాగం పన్నారని తెలిపారు. ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలు, విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. అమాయక యువతను ఆకర్షించి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని కూడా
పి.ఎఫ్.ఐ ఒక ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ, ఇది భారత్‌లో సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. CAA వ్యతిరేక నిరసనల సమయంలో, PFI భారతదేశమంతటా అల్లర్లు సృష్టించడానికి నిధులు సమకూర్చినట్లు ఆరోపణలున్నాయి. కేరళలో ఉగ్రవాద శిబిరాలు నడిపేందుకు హవాలా చానెళ్ల ద్వారా పి ఎఫ్ ఐ డబ్బును సేకరించిందని జనవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆరోపించింది.