Home News ఆదివాసీ విద్యార్థులకు చేయూతనిస్తున్న వనవాసీ కల్యాణ పరిషత్

ఆదివాసీ విద్యార్థులకు చేయూతనిస్తున్న వనవాసీ కల్యాణ పరిషత్

0
SHARE
  • 261మంది గిరిపుత్రుల ఉన్నత చదువులు పూర్తి
  • ఆదివాసీ విద్యార్థులకు చేయూతనిస్తున్న వనవాసీ కల్యాణ పరిషత్

చిట్టడవులు.. కొండలు కోనలు.. పక్షుల కిలకిలలు.. అడవి జంతువుల గాండ్రింపులు.. గుండెలు అదిరిపోయే పరిస్థితుల మధ్య గిరిపుత్రులు జీవనం సాగిస్తున్నారు. చెంచు, గోండు, కోయా, కొండరెడ్డి, నాయకపోడు, తోటి, గొత్తికోయా, మన్యవార్ వంటి గిరిజన జన జాతులు తెలంగాణ రాష్ట్రంలోని వివిద జిల్లాలలో జీవనం సాగిస్తున్నారు. వీరి పిల్లలు చదువుల కోసం వనవాసీ కల్యాణ పరిషత్ చేయూత నిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కార్యాలయం హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంది.

తెలంగాణలోని ఆదివాసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివించడానికి 2008లో వినాయక్‌నగర్ డివిజన్ దీన్‌దయల్‌నగర్‌లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ విద్యార్థి నిలయంను ఏర్పాటుచేశారు. 2008లో 23, 2009లో 24, 2010లో 28, 2011లో 23, 2012లో 31, 2013లో 25, 2014లో 27, 2015లో 30, 2016లో 50, 2017లో 40 విద్యార్థులకు వసతి కల్పించారు. గత పది సంవత్సరాలుగా 261మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం 40మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించారు. దాతల ఆర్థిక సహకారంతో గురిపుత్రులు ఉన్నత చదువులు చదువుతున్నారు.

ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్‌లు

తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ప్రతి సంవత్సరం జూన్ నెలలో గిరిజనులు ఎక్కువగా ఉన్న వరంగల్, ఖమ్మం, మెదక్, అదిలాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, మహబుబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్‌లు తీసుకుంటున్నారు. ముందస్తుగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. విద్యార్థుల అభిరుచిక అణుగునంగా వివిద కోర్సులో చేరుతున్నారు. హాస్టల్‌లో చేరిన తర్వాత విద్యార్థులందరికి పూర్తిగా వైద్య పరీక్షలు చేయిస్తారు. పదవ తరగతి చదివిన విద్యార్థులు ఉన్నత చదువు చదవడానికి మల్కాజిగిరి సర్కిల్ వినాయక్‌నగర్ డివిజన్ దీన్‌దయల్‌నగర్‌లో శ్రీరామ విద్యార్థి నిలయంలో వసతి(హాస్టల్) కల్పించారు. ప్రస్తుతం 40మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్, డిగ్రీ, పోస్టుగ్రాడ్యూయట్, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలలో చదువుతున్నారు. చదువులు పూర్తిచేసిన విద్యార్థులకు వృత్తిపరమైన ప్రత్యేక శిక్షణ కోసం కృషి చేస్తున్నారు.

సమయపాలన తప్పని సరి
విద్యార్థులకు పోషక ఆహారాలతో కూడిన భోజనాలను పెడుతున్నారు. ఇడ్లి, కిచిడీ, ఉప్మ, పూరి, పులిహోరా, పప్పు, కూరగాయలు, అన్నం పెడుతున్నారు. నెలకు ఒకసారీ ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే 4.45కు నిద్రచేస్తారు. 5.30నుంచి సరస్వతి ప్రార్థన, 6కు స్పోకేన్ ఇంగ్లీష్ కోర్సు, 7.30కు బ్రేక్‌ఫాస్ట్. 8 నుంచి నగరంలోని వివిద కాలేజీలలో చదువుకోడానికి వెలుతారు. మధ్యాహ్న 1.30కు భోజనం. 2 నుంచి 5వరకు స్టడీ, సాయంత్రం 5నుంచి 6వరకు ఆటలు, 6.30కు హారతి భజన, 7నుంచి 9వరకు స్టడీతో పాటు పరీక్షలు, 9కి రాత్రి భోజనం.
చెంచు జాతీ అభివృద్ధికి కృషిచేస్తున్న.. కొమరం రఘుపతి
నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేట తదితర ప్రాంతాలలో నివసిస్తున్న చెంచు పెంటల్లో నివసిస్తున్న గిరిజన జాతుల అభివృద్ధికోసం కృషిచేస్తున్న. వనవాసీ కల్యాణ పరిషత్ సహకారంతో ఉన్నత చదువులు చదివాను. అయితే నాజాతి ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తున్న. ఆరోగ్యం, విద్యా వంటి వాటి గురించి వారిలో చైతన్యం తీసుకువస్తున్న.
గిరిజన గ్రామాల్లో ఆరోగ్యసేవలు అందించడానికి కృషిచేస్తాం.. డా అభిలాష్
అదివాసీ గ్రామాల్లో ఆరోగ్యసేవలు అందించడానికి కృషిచేస్తాం. నేను ఇందిరా పార్కు వద్ద నున్న సాయివాణి దవాఖానాలో ఫార్మసిస్ట్‌గదా పనిచేస్తున్న. నేను ఇంతగా చదువుకుంటానని కలలోకూడ ఉహించలేదు. జయశంకర్ జిల్లా ఏటూరినాగారం దగ్గరలోని మల్యాల గ్రామంమాది. అక్కడ సౌకర్యలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆరోగ్య అవసరాలు తీర్చడానికి నావంతు కృషిచేస్తా.
మరి కొందరికి చేయూతనిస్తా.. కోపల శ్రీహరికొండ రెడ్డి

మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న వనవాసీ కల్యాణ పరిషత్‌కు వందనాలు. ఇంజనీరింగ్ పూర్తిచేశాను. ఖమ్మం జిల్లా పాపికొండల్లోని పెరంటాల పల్లి గిరిజన గూడంలో ఉంటాను. జీవితంలో మరికొందరికి నావంతు చేయూతనిస్తా. ఆధునిక సమాజంలో ఉన్నత చదువులు చదివి పోటీ ప్రపంచంలో రాణించడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

ఇంజినీరింగ్ చాడువుతాననుకోలేదు .. బందం నవీన్ కుమార్

అడవుల్లోని గిరిజన గ్రామాల్లో నివసించే నేను ఇంత చదువు చాదువుతనానని అనుకోలేదు. బాల్యం నుంచి ప్రభుత్వం తో పాటు వనవాసి పరిషత్ చదువుకోవడానికి వసతి కపించింది. ఇంజినీరింగ్ పూర్తిచేశాను. గిరిజన గుడ్లలో ఉన్న కుటుంబాల పిల్లలు చదువుల కోసం నా వంతు కృషి చేస్తా…

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో )