Home News మేడారం జాతరలో వనవాసి కళ్యాణ పరిషత్ వైద్య సేవలు

మేడారం జాతరలో వనవాసి కళ్యాణ పరిషత్ వైద్య సేవలు

0
SHARE

వనవాసి కళ్యాణ పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మేడారం జాతరలో అనారోగ్యానికి గురైన భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించారు.  నాలుగు రోజులపాటు 4 మొబైల్ అంబులెన్సులు, బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి  అనారోగ్యానికి గురైన వేలాది మంది భక్తులకు జాతరలో ఉచిత వైద్యసేవలు అందించడమే కాక మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నాలుగు రోజుల పాటు వైద్య శిబిరంలో హైదరాబాద్ నుండి విచ్చేసిన డాక్టర్ సురేందర్ జీ, అమెరికా నుండి వచ్చిన డాక్టర్ సుభాష్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ గొంది సత్యనారాయణ, డాక్టర్ కుమార్, డాక్టర్ కృష్ణ రావు, డాక్టర్ ధర్మపురి, ములుగు వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ సుతారి సతీష్ లతో పాటు 40 మంది వనవాసి కళ్యాణ పరిషత్ కు చెందిన వాలంటీర్లు, 10 మంది పారా మెడికల్ సిబ్బంది ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్యసేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత సహ సంఘటన మంత్రి ఆంజనేయులు, వరంగల్ జిల్లా కార్యదర్శి సమ్మయ్య, జిల్లా చికిత్స ప్రముఖ్ లు గురురాజ్, తిరునగరి యాదగిరి, మహబూబ్ నగర్ జిల్లా మహిళా ప్రముఖ్ లు విజయలక్ష్మి, రజిత తదితరులు పాల్గొన్నారు.