
వనవాసీ కళ్యాణ పరిషత్, ములుగు వారి ఆధ్వర్యంలో మార్చ్ 2 సోమవారం (నిన్న) కన్నాయిగూడెం, గూడురేవుల, కన్నేపెల్లి గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 122 మందికి వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ M. శ్రీలత గారు (ఫీజీషీయన్) , డాక్టర్ K. వెంకటస్వామి గారు (ఎముకలు, కీళ్ళ వైద్య నిపుణులు), డాక్టర్. గొంది సత్యనారాయణ గార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో వనవాసీ కళ్యాణ పరిషత్ జిల్లా అధ్యక్షులు, చిట్టి మల్ల శ్యామ్ ప్రసాద్ గారు, డాక్టర్ గురురాజ్ గార్లతో పాటు, ల్యాబ్ టెక్నిషన్ హర్షద్ గారు, యం.డి శామ్య గారు, జిల్లా సంఘటన కార్యదర్శి నూనె రాజు గారు, ఆవాస నిలయ ప్రముక్ సూదికొండ గణేష్ గారు, ఆంబులెన్స్ డ్రైవర్ జగదీష్ పాల్గొన్నారు.



వార్తా సేకరణ: వరంగల్ నుండి మా ప్రతినిధి