విప్లవ రచయితల సంఘం నేత, కమ్యూనిస్టు నాయకుడు వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలైనట్లు సమాచారం.
దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో వరవరరావుని పోలీసులు విచారించారు. మోదీ హత్యకు వరవరరావు నిధులు సమకూర్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పుణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్‌టాప్‌లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. పుణెలో నమోదైన కేసులో వీరందరినీ పోలీసులు విచారిస్తున్నారు.
Courtesy: Sakshi.com