అటల్ బిహారి వాజ్ పేయి గారికి శ్రద్ధాంజలి
శ్రద్దేయ అటల్ బిహారి గారి మరణం మమ్ములను తీవ్రంగా కలిచివేసింది. వారు బౌతికంగా మన నుంచి దూరం కావడాన్ని ఊహించడం సైతం కష్టంగా ఉంది. వారి సైద్ధాంతిక నిబద్దతతో పాటు, సామజిక, రాజాకీయ క్షేత్రం లో వారి పరిశ్రమ, కర్తవ్య దీక్ష ద్వార ఒక ఆచరణీయ జీవితాన్ని సమర్పించిన వ్యక్తి గా ఎల్లపుడు స్మరణలో ఉంటారు.
భవిషత్తు ను స్పష్టంగా చూడగలిగిన ఒక ద్రుష్ట, ప్రజల ద్వారా గొప్పగా ఆదరించబడిన మహా వ్యక్తిత్వం కలిగి, ఒక సున్నితమైన కవి పేరు అటల్ జి. ‘అటల్’ అనే పదానికి సమానార్ధకంగా జీవించిన వ్యక్తి.
మహా రాజకీయ నాయకుడు, అద్బుతమైన వాక్చాతుర్యం, స్వయంసేవకుడు, అంతులేని భారతీయల హృదయాలు గెల్చుకున్న అటల్ బిహారి వాజపేయి గారికి ఇవే మా అంతమ నమస్కారాలు.
మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్
సురేష్ (భయ్యాజి) జోషి, సర్కార్యవాహ
(rss.org సౌజన్యం తో)