
విదేశీ నిధులు పొందుతున్న స్వచ్చంద సంస్థలకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యాలయ అధికారులను, ముఖ్యమైన ఉద్యోగుల విషయంలో మార్పులు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (Foreign Contribution Regulation Act) 2010లోని సెక్షన్ 11, 12 ప్రకారంవిదేశీ నిధుల కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. సంస్థకు చెందిన డైరెక్టర్లు, కార్యదర్శులు, ఇతర ముఖ్య ఉద్యోగుల వివరాలు దరఖాస్తు సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఉద్యోగుల వివరాలలో ఏవైనా మార్పు జరిగితే ఆ విషయాన్నీ హోంశాఖకు సమర్పించాలి. ఐతే అనేక సంస్థలు ఈ నిబంధన పట్టించుకోవడం లేదన్న విషయాన్ని తాము గమనించామని, సంస్థల్లో చేసుకున్న మార్పుల సమాచారం తమకు పంపించని సంస్థలపై చట్టప్రకారం చర్య తీసుకుంటామని కేంద్ర హోమ్ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

Source: News Bharati