
సుభాష్ చంద్రబోస్
జనత సేకరించి జగము నేకము జేసె
భారతాంబ కొరకు పోరు సల్పె
వీర బోసు నింపె ధీరత్వము మనలొ
వినుర భారతీయ వీర చరిత
భావము
భారతదేశంలో స్వతంత్ర సమరం సాగిస్తూనే జపాన్ జర్మనీ వంటి దేశాలలో పర్యటించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను ఏకం చేశారు. “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను” అంటూ భారతీయుల్లో ధైర్యాన్ని నింపి, స్వరాజ్య సమరాన్ని ముందుకు నడిపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీర చరిత విను ఓ భారతీయుడా!
రాంనరేష్