
మదన్ లాల్ ధీంగ్రా
కర్జను తను జంపె గర్జన తో ధీంగ్ర
ఉరిని శిక్ష వేయ ఉరికి వచ్చె
భారతాంబ కొరకు మరల పుట్టెదననె
వినుర భారతీయ వీర చరిత
భావము
బెంగాల్‌ను విభజించి అరాచకాలు సృష్టించిన లార్డ్ కర్జన్‌ను మదన్ లాల్ ధీంగ్రా మట్టుబెట్టారు. బ్రిటీషు ప్రభుత్వం వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అయినా కానీ దేశమాత స్వేచ్ఛ కోసం అనేక సార్లు జన్మిస్తానని, ఉరికి సిద్ధం అని చెప్పిన వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా!
-రాంనరేష్