బీనాదాస్
బెబ్బులయ్యి గాల్చె బెంగాల్ గవర్నరున్
భీతి వదిలి చెలగె బీనదాసు
బోసు బాట నడిచి పోరు సల్పె వనిత
వినుర భారతీయ వీర చరిత
భావము
స్వరాజ్య సమరయోధురాలు బీనాదాస్ 21 సంవత్సరాల వయస్సులో ఆంగ్లేయులపై పులి లాగా చెలరేగారు. 1932లో నాటి బెంగాల్ బ్రిటీష్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా ప్రేరేపితులైనారు. 1940లో మరోసారి జైలు పాలైనారు. అటువంటి వీర వనిత బీనాదాస్ చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్