బాంబులు పేల్చడంతో ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన స్వరాజ్య సమర యోధులు ప్రతివాది భయంకర వెంకటాచారి. స్వరాజ్యం కోసం పోరాడుతున్న ప్రజలను దారుణంగా హింసిస్తున్న ముస్తాఫ్ అలీఖాన్ లాంటి పోలీసు అధికారుల పని పట్టాలనుకున్నారు. తమ రహస్య కార్యకలాపాలను కప్పిపుచ్చుకోవడానికి CHS చారి అండ్ కంపెనీ అనే ఒక వ్యాపార సంస్థను కాకినాడలో నెలకొల్పారు.
ముస్తాఫ్ అలీఖాన్‌ను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ముస్తాఫ్ ఖాన్ ఉప్పుటేరు మీదుగా రాకపోకలు సాగించే బోటులో బాంబు పేల్చడానికి ముహూర్తం పెట్టారు. 1933 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన బోటులో బాంబు పేలింది. అదే సమయానికి బోటులో ముస్తాఫ్ ఖాన్ లేడు. భయంకర వెంకటాచారిని బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేశారు. అండమాన్ సెల్యూలర్ జైలులో 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఆయన అనుభవించారు.