
నల్ల నరసింహారెడ్డి
కత్తి బట్టి పొడచు కరకురజాకరున్
పీకపిసికి జంపె పీడ వదల
నారసింహునోలె నల్లనర్సింహుడు
వినుర భారతీయ వీర చరిత
భావము
తనను వెనుక నుంచి కత్తితో పొడవబోతున్న కరకు దుర్మార్గుడు రజాకరున్ని లాఘవంగా ఒడిసి పట్టి, వాని గొంతు పిసికి చంపి, నరసింహావతారాన్ని గుర్తుకు తెచ్చిన నల్ల నరసింహారెడ్డి వీర చరిత్ర విను ఓ భారతీయుడా!
– రాంనరేష్