పురుషోత్తముడు
విశ్వజేత ననుచు విశ్వమంత తిరిగి
విశ్వగురువు పోర విసిగి జీల
మునను పట్టుబడెను మన పురుషోత్తమున్
వినుర భారతీయ వీర చరిత
భావము
కొన్ని దేశాలను జయించగానే నేనిక విశ్వవిజేతను అవుతాను అంటూ విర్రవీగాడు అలెగ్జాండర్. భారతదేశంపైకి దాడికి బయలుదేరినాడు. అంతటి అలెగ్జాండర్‌ను జీలం అనే చిన్న రాజ్యానికి రాజైనటువంటి పురుషోత్తముడు ఎదిరించాడు. విశ్వవిజేతను అవుతానని విర్రవీగిన అలెగ్జాండర్‌ను ఓడించిన వీరుడు పురుషోత్తముని చరిత విను ఓ భారతీయుడా!
-రాం నరేష్