దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవ్ జరుపుకుంటున్న వేళ కీలకమైన స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) అంశంలో గణనీయమైన వృద్ధిని భారత్ నమోదు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి గాను 13.5 శాతంగా GDP నమోదైంది. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికానికి GDP 4.1 శాతంగా ఉందని బుధవారం (ఆగస్టు 31) సంయుక్తంగా వెలువరించి డేటాలో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇమ్‌ప్లిమెంటేషన్ వెల్లడించాయి.
భారతీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ సంవత్సరంలో ఇది అత్యంత చురుకైన వృద్ధిగా నమోదైంది.
2011-12 ఆర్థిక సంవత్సరానికి స్థిరీకరించిన ధరల వద్ద 2022-23 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికానికి రూ.36.85 లక్షల కోట్ల స్థాయిని GDP సాధిస్తుందని ఒక అంచనా. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికానికి ఇదే అంచనా రూ.32.46 లక్షల కోట్లుగా ఉంది. గత సంవత్సరంతో పోల్చినప్పుడు ప్రస్తుతం GDP 13.5 శాతం వృద్ధిని సాధించింది.
అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి నామమాత్రపు GDP లేదా ప్రస్తుత ధరల వద్ద GDPని రూ.64.95 లక్షల కోట్లుగా అంచనా వేయడమైనది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.51.27 లక్షల కోట్లుగా ఉంది.
కంట్రోల్ జనరల్ అకౌంట్స్ (CGA) అండ్ కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) వెబ్‌సైట్ వద్ద అందుబాటులో ఉన్న తాజా సమాచారాన్ని ప్రస్తుత ధరల వద్ద ఉత్పత్తులపై పన్నులను, ఉత్పత్తులపై రాయితీలను అంచనా వేయడానికి వినియోగిస్తారని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇమ్‌ప్లిమెంటేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Source: ORGANISER