
పంజాబు
పంచనదులు పారె పరమ పావనభూమి
సింహ విక్రములగు సిక్కు భూమి
కర్మ వీరులున్న ధర్మ పంజాబిది
వినుర భారతీయ వీరచరిత
భావము
జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, సింధు అనే ఐదు నదులు ప్రవహించే పుణ్యభూమి. ధర్మరక్షణ కోసం సింహ విక్రములైన సిక్కు వీరులు ఉన్న భూమి. ధర్మ భూమి అయిన పంజాబ్ వీర చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్