Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

శంభాజీ

తనువు ముక్క లైన తప్పక ధర్మము
స్పూర్తి నింపి దేశ కీర్తి బెంచె
వీర శివుని పుత్రు ధీర శంభాజియె
వినుర భారతీయ వీర చరిత

భావము

వీర శివాజీ అనంతరం ధర్మ రక్షణకు శంభాజీ కంకణబద్ధులైనారు. ఔరంగజేబును మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడకుండా చేసినారు. శంభాజీ ఆదమరిచి ఉన్న కాలంలో ఔరంగజేబు దొంగ దెబ్బ తీశాడు. శంభాజీని బంధిస్తాడు. మతం మార్చుకుంటే ప్రాణాలతో విడిచిపెడతానని ఔరంగజేబు అంటాడు. స్వధర్మాచరణకు కట్టుబడిన శంభాజీ మతం మార్చుకోవడానికి అంగీకరించరు. అయినను శంభాజీపై ఒత్తిడి తెస్తాడు ఔరంగజేబు. తన దేహంలోని ఒక్కొక్క అవయవాన్ని ఖండిస్తున్నప్పటికీ ప్రాణం పోయేంతవరకు ధర్మనిష్టను తప్పని వీర శంభాజీ చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్