Home News బంజ‌ర‌గ్ ద‌ళ్ కార్య‌క‌ర్త హర్ష హ‌త్య కేసుపై NIA చార్జిషీట్‌

బంజ‌ర‌గ్ ద‌ళ్ కార్య‌క‌ర్త హర్ష హ‌త్య కేసుపై NIA చార్జిషీట్‌

0
SHARE

క‌ర్ణాట‌క‌లోని శివ‌మొగ్గ‌కు చెందిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసుపై 750 పేజీల ఛార్జిషీట్ ను జాతీయ ద‌ర్యాప్తు ఏజెన్సీ (NIA) అధికారులు NIA ప్రత్యేక కోర్టుకు దాఖలు చేశారు.

మీడియా కథనాల ప్రకారం, హత్యకు మ‌త‌ప‌ర‌మైన ద్వేషమే కారణం అని ఛార్జ్ షీట్ పేర్కొంది. పాత క‌ల‌హాల కార‌ణంగానే బ‌జ‌రంగ్‌ద‌ళ్ కార్యకర్తను హ‌త్య చేశారు. త‌ద్వారా భయాందోళనల‌ను రేకెత్తించాల‌నే ఉద్దేశ్యంతో 15 రోజుల ప‌క్కా ప్ర‌ణాళికతో హర్షను నిందితులు హత్య చేసినట్లు చార్జిషీట్ వెల్ల‌డించింది.

హిజాబ్ వివాదంపై ఫెస్‌బుక్ లో హ‌ర్ష ఒక పోస్టు చేయ‌డంతో రాడికల్ ఇస్లాంవాదులు అత‌న్ని ఫిబ్రవరి 20 రాత్రి శివమొగ్గ జిల్లాలో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన హిందువుల్లో తీవ్ర ఆగ్రహాన్ని క‌లిగించింది. జిల్లా యంత్రాంగం కర్ఫ్యూను అమలు చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో హర్ష‌ కేసును NIA కి అప్పగించింది. కేసుపై ఒక చార్జిషీట్ ను NIA అధికారులు ప్ర‌త్యేక కోర్టుకు స‌మ‌ర్పించారు.