Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

రాణి అవంతి బాయి
పొరుగు రాజులనిట పోరుబాట నడుప
తెల్లవాని గుండెఝల్లనంగ
రణపు చండికయ్యె రణమునను అవంతి
వినుర భారతీయ వీర చరిత

భావము
బ్రిటిషువారి దుర్మార్గపు పాలనను గుడ్డిగా అనుకరించకుండా ధైర్యంగా భరతమాత వీర పుత్రుడు పోరాడాలని పిలుపునిచ్చి, 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో పొరుగు రాజ్యాల రాజులందరిని ఏకం చేసి, ఆంగ్లేయులను బెదరగొట్టి ఓడించింది. యుద్ధములో చండిక వోలె చెలరేగిన రామఘడ్ రాణి అవంతి బాయి వీర చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్