Home Telugu Articles వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

గురు తేజ్ బహదూర్ సింగ్

తలను కోసినింత ధర్మము దప్పక
నిలచె జూడు తాను నిశ్చలముగ
వీర గురు వితండు ధీర తేజ బహదూర్
వినుర భారతీయ వీర చరిత

భావము

ఇస్లాంను స్వీకరించండి అని సిక్కులను బెదిరించాడు ఔరంగజేబు. ‘నన్ను మార్చిన తర్వాతనే మిగతా వారిని మార్చండి’ అని ఔరంగజేబుకు తెలిపారు సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్ సింగ్. సిక్కుల 9వ గురువుతో ఇస్లాం స్వీకరించేలా శతవిధాలుగా ప్రయత్నించి, విఫలమైనాడు ఔరంగజేబు. ఆగ్రహంతో గురు తేజ్ బహదూర్ శిరస్సును ఖండించమని ఆజ్ఞాపిస్తాడు. తన శిరస్సు ఖండిస్తున్నప్పటికీ చిరునవ్వుతో నిశ్చలంగా కూర్చుంటాడే కానీ ధర్మం మారని ధీర గురువు తేజ్ బహదూర్ చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్