Home News వివేకానంద సేవా సమ్మాన్-2019 పురస్కారానికి ఎంపికైన డా. శ్రీ బి సురేందర్ రెడ్డి

వివేకానంద సేవా సమ్మాన్-2019 పురస్కారానికి ఎంపికైన డా. శ్రీ బి సురేందర్ రెడ్డి

0
SHARE

గత 33 ఏళ్లుగా ప్రతి ఏటా బెంగాల్ కు చెందిన శ్రీ బుర్రాబజార్ కుమారసభ పుస్తకాలయ్ వారు ప్రదానం
చేస్తున్న ప్రతిష్టాత్మక ‘వివేకానంద సేవా సమ్మాన్’ పురస్కారం 2019 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సామజిక కార్యకర్త డా. శ్రీ బి సురేందర్ రెడ్డి ఎంపికయ్యారు.

జూలై 3, 1938వ సంవత్సరంలో వరంగల్ పట్టణంలో జన్మించిన సురేందర్ రెడ్డి 1963లో హైద్రాబాదులో మెడిసిన్ పూర్తిచేశారు. 1950వ సంవత్సరంలో విద్యార్థి దశ నుండే  ఆరెస్సెస్ స్వయంసేవక్ గా సంఘ కార్యంలో నిమగ్నమైన సురేందర్ రెడ్డి ఎంబీబీఎస్ అనంతరం 1964 నుండి 1973 వరకు పూర్తి స్థాయి కార్యకర్త (ప్రచారక్)గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం తమ పూర్వీకులకు చెందిన గ్రామంలోని ప్రజల కోసం వారు ఒక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. 1976లో తన వివాహానంతరం నుండి అంటరానితనం నిర్మూలన, సామాజిక సమరసత కోసం పనిచేశారు. ఇందుకు నాందిగా, కులవివక్ష తీవ్రంగా ఉన్న ఆ కాలంలో తన ఆసుపత్రిలో షెడ్యూల్డ్ కులానికి చెందిన కుటుంబాన్ని సహాయకులుగా నియమించారు. అంతే కాకుండా తమ గ్రామంలోని 100 ఏళ్ల నాటి దేవాలయాన్ని పునర్నిర్మించి ఆ ఆలయంలోకి అన్ని కులాల ప్రజలకు ప్రవేశం కల్పించారు. 1982లో తమ గ్రామంలో సరస్వతి శిశుమందిరంతో పాటు ఒక ఆసుపత్రిని నిర్మించారు. వీటితో పాటుగా తమ గ్రామంలో సామాజిక ఐక్యతను తీసుకువచ్చేందుకు బతుకమ్మ, విజయదశమి వంటి పర్వదినాలను గ్రామస్తులంతా కలిసి ఆనందంగా జరుపుకునే ఒక సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు. వీటి ఫలితంగా ఇప్పుడు ఆ గ్రామం కులవివక్ష రహిత గ్రామంగా రూపుదిద్దుకుంది.

సామాజిక సమరసత కోసం చేస్తున్న కృషిలో సురేంద్ర రెడ్డి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1999లో వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కేంద్రంపై నక్సలైట్లు బాంబులతో దాడులకు తెగబడ్డారు. అంతేకాకుండా గ్రామస్తుల కోసం నెలకొల్పిన ఆరోగ్య కేంద్రాన్ని కూడా నక్సలైట్లు లక్ష్యంగా చేసుకుని 2000 సంవత్సరంలో దాడి చేసారు.

అనంతరం హైదరాబాద్ నగరానికి చేరుకున్న సురేంద్ర రెడ్డి సేవా భారతి ద్వారా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారు ఆరోగ్య భారతి జాతీయ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు.

వివేకానంద సేవా సమ్మాన్ పురస్కారాన్ని ఫిబ్రవరి 16న ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ శ్రీ గణేశిలాల్ సురేందర్ రెడ్డికి అందజేయనున్నారు.

Source: Organiser