న్యాయమూర్తి దేవకి నందన్ అగర్వాల్
రామసఖి పూత్రుడైయ్యారు రామసఖా, శ్రీ రామ జన్మభూమి ఉద్యమం ఆరంభమైయుండేను. దేశంలోని అన్ని సంప్రదాయాల ధర్మగురువులతో కూడిన ఒక మార్గదర్శక మండలి ఏర్పాటైంది. సాధు-సంతువుల “శ్రీ రామ జన్మభూమి మా శ్రద్ధా-ఆస్థాకు సంబంధించిన విషయం, ఇందులో ఎటువంటి పంచాయతి కానీ, ప్రభుత్వాల జోక్యాన్ని ఒప్పుకోము. మాకు ధర్మాచార్యుల, ధార్మిక గ్రంథాలే ప్రధానం.” అనే స్పష్టమైన ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు. ఆ సమయంలో అలాహాబాద్ హైకోర్టు నుండి రిటైరైన తర్వాత న్యాయమూర్తి దేవకి నందన్ అగ్రవాల్ గారు ప్రయాగలోని తమ పూర్వికుల గృహంలోనే నివసించారు. విశ్వహిందూ పరిషత్ లో జాతీయ ఉపాధ్యక్ష బాధ్యత వహిస్తున్నారు. వారు రామలలా కేసు విచారణలో పాల్గొనాలనుకునేవారు. 1984న చివరిలో సాధు-సంతువుల సమక్షంలో ఈ విషయ ప్రస్తావనకు వచ్చింది. కోర్టులో శ్రీరామ జన్మభూమి కేసు విచారణ అయితే జరుగుతోంది. కానీ వాటిలో రామలలా యాజమాన్య హక్కు విచారణలో లేదు. ఒక వాదన గోపాల్ సింగ్ విశారద వారిది పూజా-దర్శనాల పై ఉంది. రెండోది నిర్మోహి అఖాడా పూజాదికాలు సమర్పణలపై ఉంది. ఇక మూడవ విచారణ (వాదన) ముస్లీముల యాజమాన్యపు హక్కు విషయానిది. కావునా రామలలా వైపునుండి మరో కేసు వేయాలని నిర్ణయించడమైనది.
న్యాయమూర్తి దేవకీ నందన్ అగ్రవాల్, అలాహాబాదు హైకోర్టు న్యాయవాది వీరెంద్ర కుమార్ సింగ్ చౌధరి గారు ముందుకు వచ్చారు. దేవకీ నందన్ అగ్రవాల్ “మా అమ్మపేరు రామసఖి, నేను రామ సఖాగా జల్లా జడ్జి, ఫైజాబాద్ నుండి డిలిమిటేషన్ పేరుతో కేసువేస్తానాను” అని అన్నారు. ఈ విధంగా 1989 జులై 1న రామలలా మొట్టమొదటిసారి న్యాయాలయానికెళ్ళినట్లైయ్యింది. అక్కడ వారు స్పష్టంగా ఏ స్థలంలో నేను విరాజితుడైనానో. ఆ సంపూర్ణ స్థానం, సంపదంతయూ నాదే, ఇదే ప్రార్థన జన్మభూమి, దేవకీ నందన్ అగ్రవాల్ వైపునుండి కూడా ఉన్నది. ఈ విధంగా 4వ కేసు వాదన రామలలావైపునుండి, దేవకీ నందన్ అగ్రవాల్ గారు రామసఖాగా అయ్యారు. అప్పటికే ఉద్యమం దేశమంతయు వ్యాపించి ఉన్నది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దేశ పరిస్థితులు విషమించే ప్రమాదమున్నదని అలాహాబాదు కోర్టు నుండి ఫైజాబాద్ ఉన్నత న్యాయాలయానికి విచారణను బదిలిచేస్తు త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పునివ్వాలని కోరింది. 1989లో ఫైజాబాద్ నుండి అన్ని కేసులు అలాహాబాద్ ఉన్నత న్యాయాలయపు లక్నో పీఠానికి బదలాయించడం జరిగింది. దానితో ప్రతిరోజు వాదనలు వినడం ప్రారంభమైంది. 1992 డిసెంబర్ 16న కట్టడం విధ్వంసమైన తర్వాత ప్రభుత్వం తన వాదనలను వెనిక్కి తీసుకుంది. ఇక రెండే ముఖ్యమైన వాదనలు(కేసులు) మిగిలాయి. సున్ని వక్ఫ్ బౌర్డు ద్వారా వేయబడిన కేసు వాదనలో వారు హిందూవులు వాదించే జన్మ స్థలం సమతల భూమి ఉండింది, దానిపై బాబరు ఆదేశాలతో మసీదు కట్టబడిందన్నారు. అదే రామలలా వైపు నుండి తమ వాదనలో శ్రీరామ జన్మభూమి స్థలంలో సువిశాలమైన మందిరం ఉండింది, దానిని భగ్నం చేసి మీర్ బాకి మసీదును కట్టాడు అని స్పష్టం చేశారు. ఈ విధంగా దేవకీ నందన్ అగ్రవాల్ గారు ప్రత్యక్షంగా శ్రీ రాముల వారిని వాదనలలోకి తీసుకొచ్చి కేసును రసవత్తరంగా తయ్యారు చేయగలిగారు. ముస్లీంల ఎత్తులకు ప్రభుత్వాల జిత్తులకు చెక్ పెట్టినట్లైయ్యింది.