పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాకిస్తాన్ ప్రేరిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన 9 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది.
పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ నుంచి కేరళలోని ఎర్నాకుళం నుంచి ఆల్-ఖైదా తో సంబంధమున్న 9 మంది ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కీలక పత్రాలను, డిజిటల్ పరికరాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన ఉగ్రవాదులను ముర్షిద్ హసన్, ఇయాకుబ్ బిస్వాస్, మోసారఫ్ హుస్సేన్, నజ్ముస్ సాకిబ్, అబూ సుఫియాన్, మైనూల్ మొండల్, ల్యూ యేన్ అహ్మద్, అల్ మామున్ కమల్, అతితూర్ రెహ్మాన్ లుగా గుర్తించారు.
వీరిలో ఆరుగురు ముర్షిదాబాద్ కి చెందిన వారు కాగా మిగిలిన ముగ్గురు ఎర్నాకులం చెందిన వారని ఎన్ఐఏ తెలిపింది.
ఈ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆల్ ఖైదా లో చేరి దేశ రాజధాని అయిన ఢిల్లీ తో సహా దేశవ్యాప్తంగా భారీ జన సమూహ ప్రదేశాల్లో బాంబు దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర చేస్తున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది.
అందుకోసం నిధులు సేకరించడంతో పాటు ఢిల్లీకి వెళ్లి ఆయుధాలను సమకూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది.
ఉగ్రవాదుల నుంచి డిజిటల్ పరికరాలు, పత్రాలు, జిహాదీ పుస్తకాలు, ఆయుధాలు, దేశీయ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది.
“అల్ ఖైదా 1980 లలో ఒసామా బిన్ లాడెన్ చేత స్థాపించబడింది మరియు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక ఉగ్రవాద దాడులకు కారణమైంది”.
Source : OPINDIA