Home News ఆర్.ఎస్.ఎస్ సర్‌సంఘ్‌చాలక్ జీ ఏమన్నారు..? మీడియా ఏమంటోంది..

ఆర్.ఎస్.ఎస్ సర్‌సంఘ్‌చాలక్ జీ ఏమన్నారు..? మీడియా ఏమంటోంది..

0
SHARE

హరిద్వార్‌లోని శ్రీ పూర్ణానంద ఆశ్రమంలో ఆరు రోజుల వేదాంత సమ్మేళనం చివరి రోజైన ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మాననీయ మోహన్ భగవత్‌జీ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ “ఒక ప్రయోజనం కోసం సమాజం ముందుకు వెళుతోంది, మీరు దానికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. మేము నిత్యం మీ వెన్నంటి ఉంటాము. సమయం పడుతుంది. ఎంత మాట్లాడుకున్నా కానీ అదంతా ఒక్కసారిగా కార్యరూపం దాల్చదు. నా దగ్గర ఏమీ లేదు, ప్రజల దగ్గర ఉంది. వారి చేతిలో అంకుశం ఉన్నది. వారు సిద్ధమైన పక్షంలో అందరి గతి మారిపోతుంది. ఆ దిశగా మేం సన్నాహాలు చేస్తున్నాం. మీరు కూడా చేయండి. మనం ఆదర్శవంతంగా నిలిచి కలసికట్టుగా సరిగ్గా అలాగే ముందుకు సాగుదాం. అదే తీరుగా సమష్టిగా ముందుకు సాగుదాం, ఓటమి అన్నది ఎరుగకుండా, భయం అన్నది లేకుండా విజయవంతంగా ముందుకు సాగుదాం” అని అన్నారు.
“లోకం శక్తివంతుల మాట వింటుంది. మనకంటూ శక్తి ఉంది, శక్తిని సముపార్జించుకోవాలి. ప్రదర్శించాలి కూడా. అప్రమత్తతో ముందుకు సాగాలి. ఆలాగే వెళుతున్నాం కూడా” అని సర్‌సంఘ్‌చాలక్ జీ అన్నారు.

“ఇదే వేగంతో సాగుదాం. అనుకున్నవిధంగా పని పూర్తి కావాలి. మీరు 20 నుంచి 25 సంవత్సరాలు అంటున్నారు. కొద్దిగా వేగాన్ని పెంచితే 10 నుంచి 15 సంవత్సరాలే అని నేను అంటున్నాను. ఏ భవ్య భారతాన్ని మనం కోరుకుంటున్నామో అదే భారత్‌ను స్వామి వివేకానంద వారి మనోనేత్రాలతో వీక్షించారు. ఆ ఉజ్వల భారతాన్ని ఇదే దేహంతో, మన నేత్రాలతో, ఇదే జీవిత కాలంలో చూస్తామని మహర్షి యోగి అరవిందులు భవిష్యవాణి వినిపించారు. అదే నా శుభాకాంక్ష, మీ ఆకాంక్ష, మనందరి సంకల్పంగా కూడా” అని వారు తెలిపారు.

ఉపన్యాసంలో పూజ్య సర్ సంఘచాలక్ జీ స్వామి వివేకానంద, మహర్షి అరవిందులు దర్శించిన ఉజ్వల భారతాన్ని గురించి, దానిని త్వరితంగా సాధించడం గురించి మాత్రమే మాట్లాడారు. కానీ మీడియాలో కొందరికి మాత్రం ఆయన అసలు ప్రస్తావించని `అఖండ భారతం’ కనిపించింది. దానితో “15 సంవత్సరాల్లో అఖండ్ భారత్ అని మోహన్ భాగవత్ అన్నారు” అంటూ వ్రాసేశారు. అంతేకాదు “ఈ మాటలు చెప్పడానికి వారు ఎవరు? వారు ఏమైనా ప్రధానమంత్రా? హోమ్ మంత్రా? న్యాయమూర్తా? “అంటూ ప్రశ్నించడం, ప్రచారం చేయడం కూడా ప్రారంభించారు. ఆర్. ఎస్. ఎస్ విషయంలో మీడియాలో కొందరు ఎప్పుడు ఇలా విచిత్రంగానే వ్యవహరిస్తుంటారు.