Home News ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీలో చైనాపై చర్చ

ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీలో చైనాపై చర్చ

0
SHARE

ఈ రోజు జరిగే ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ (WHA) సమావేశాల్లో ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోన వైరస్ వ్యాప్తి గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి చెందడానికి  చైనా ఎంతవరకు కారణమో నిర్ణయించడానికి, అలాగే మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని అధ్యక్షుడు ట్రెడోస్ పాత్ర గురించి కూడా చర్చ జరుగుతుందని తెలిసింది. భారత్ తో సహా 65 సభ్యదేశాలు రూపొందించిన కోవిడ్ 19 తీర్మానంపై ఈ చర్చ జరుగుతుంది. కరోన వైరస్ ఎక్కడ ప్రారంభమైంది, ఎలా వ్యాపించింది, వైరస్ వ్యాప్తిలో చైనా పాత్ర, ఆ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ముఖ్యంగా ఆ సంస్థ అధినేత ట్రెడోస్, పని తీరు గురించి చర్చించాలని ఈ దేశాలు కోరాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ సమావేశాల అజెండాలో మూడవ విషయంగా ఈ తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముసాయిదా తీర్మానాన్ని భారత్, బంగ్లాదేశ్, కెనడా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, యూరోపియన్ యూనియన్ , లండన్ మొదలైన 65 దేశాలు ప్రతిపాదించాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అసెంబ్లీ సమావేశాల్లో సభ్య దేశాలు సంస్థ బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలుపుతాయి. అలాగే వివిధ అంశాలపై కూడా చర్చ, ఓటింగ్ జరుగుతుంది. ఈసారి కోవిడ్ 19 విషయమై విశేషమైన చర్చ జరుగుతుంది. అలాగే కరోన వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా అరికట్టడామెకాక, ప్రపంచాన్ని ముందుగా హెచ్చరించిన తైవాన్ కు సంస్థలో సభ్యత్వం ఇవ్వడం గురించి కూడా చర్చ జరుగుతుంది. తైవాన్ తమ దేశంలో ఒక భాగం(one china) కనుక ప్రత్యేకంగా సభ్యత్వం ఎలా ఇస్తారంటూ చైనా అభ్యంతరం తెలుపుతోంది.

డిసెంబర్, 2019లో చైనా లోని వుహాన్ లో మొట్టమొదటసారి గుర్తించిన కరోన వైరస్ ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలను చుట్టబెట్టింది. దీని నిరోధానికి ఇప్పటివరకు వాక్సిన్ ఏది లేనందువల్ల అన్నీ దేశాలు ఈ వైరస్ వ్యాప్తిని, దాని వల్ల కలిగే కోవిడ్ 19 వ్యాధిని అరికట్టడం ఎలాగో తెలియక సతమతమవుతున్నాయి. ఇప్పటి వరకు చైనా, దక్షిణ కొరియా, స్పైన్, ఇరాన్, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, ఇటలీ లు అత్యధిక నష్టం చవిచూశాయి.  ముఖ్యంగా అమెరికాలో  1 కోటికి పైగా వైరస్ సోకగా, అందులో 89వేల మందికి పైగా మరణించారు.