Home News భారతీయ సంస్కృతి ని భావితరానికి అందివ్వడంలో మహిళలదే కీలక పాత్ర

భారతీయ సంస్కృతి ని భావితరానికి అందివ్వడంలో మహిళలదే కీలక పాత్ర

0
SHARE

భారతీయ సంస్కృతి దృడంగా ఉన్నపుడే మనతో పాటు  ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది అని విశ్వసించి, తాను పుట్టిన దేశాన్ని (ఐర్లాండ్) వదిలి భారత దేశాన్ని కన్న తల్లిగా భావించి జీవితాన్ని ధారపోసిన నిస్వార్ధ మహిళ సోదరి నివేదిత. ఆమె జీవితం అందిరికి స్పూర్తిదాయకం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న ప్రతీకుల పరిస్తితులకు సైతం ఎదుర్కొని  మహిళా చైతన్యం కొరకు విద్య, సేవ ప్రధానం అని ఆ దశలో పని చేసిన గొప్ప దేశ భక్తురాలు అని, ఆచార్య పి. సుమతి నాగేంద్ర గారు తెలిపారు.

సోదరి నివేదిత 150 జయంతి ఉత్సవాలలో ‘సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్’ వారు  29 అక్టోబర్  నాడు హైదరాబాద్, ఖైరతాబాద్  లోని ఇండియన్  ఇన్స్టిట్యూట్  అఫ్  కామెర్స్  అండ్  మానేజిమెంట్’   ప్రాంగణంలో   “పాత్రికేయలు,  రచయితలు,  సోషల్మీడియా  ఆక్టివిస్ట్ -మహిళల  సమావేశం ”  అని కార్యక్రమంలో పి. సుమతి గారు ముఖ్య అతిధి పాల్గొని గా ప్రసంగించారు.

పి. సుమతి గారు మాట్లాడుతూ సమాజంలో   నాలగవ  మూల  స్థంభంగా  కొనియాడే  పాత్రికేయ వృత్తిలో  ఉన్న  మహళలది  కీలక  పాత్ర  అని,  దాన్ని  సమర్ధవంతంగా  పోషించి దేశానికి  మార్గదర్శనం ఇవ్వడంలో ముందు ఉండాలి అని సూచించారు.

కార్యక్రమ మరో ముఖ్య అతిధిగా పాల్గొన్న రచయిత డాక్టర్  పుట్టపర్తి  నాగ  పద్మిని  గారు  మాట్లాడుతూ “సంస్కృతీ అనేది  ఒక  తరం  నుండి  మరొక  తరానికి  అందించగల  వారు  మహిళలు అని,  ఒక  విదేశీరాలు  అయినా  సోదరి  నివేదిత  స్వామివివేకానంద  బోధనల ద్వారా ప్రభావితమై హిందుత్వాన్ని స్వీకరించి  భారత మాత సేవలో  లీనమైన విధానం ఆదర్శనీయం. భారతీయలు అందరిని ఏకైక పరిచే హిందుత్వం జరుగుతున్న దాడులు తిప్పి కొట్టాలి అని, భారతీయ దృక్కోణంలో చరిత్ర ను రాసి దేశ ఔనత్యాన్ని తిరిగి సాధించాలి అని అన్నారు.

ఈ సమావేశంలో జరిగిన చర్చలో మీడియా రంగంలో ఎదురవుతున్న వివిధ సమస్యల పట్ల, హిందూ సంస్కృతి పై జరుగుతున్న దాడిని దృష్టికి తీసుకొని వచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులు మరియు మహిళా రచయితలు పాల్గొన్నారు. సమాచార భారతి కార్యదర్శి శ్రీ ఆయుష్ సమాచార భారతి ద్వారా జరుగుతున్నా వివిద్ కార్యక్రామాలని వివరిచారు. కార్యక్రం యొక్క నిర్వహణ శ్రీమతి దేవిక మరియ శ్రీమతి  ఆరాధన చేసారు.