58 ఏళ్ల క్రితం చైనా ఆక్రమించుకున్న భూభాగాలను ఒక్కొక్కటిగా భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. 1962 యుద్ధం తరువాత లఢఖ్ ప్రాంతంలోని ఫింగర్ 4 తో సహా మరో నాలుగు ప్రదేశాలను భారత్ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీనితో చొరబాట్ల ద్వారా భూ అక్రమణకు పాల్పడి, తన భూబాగాన్ని విస్తరించుకోవాలనుకున్న చైనా కపట వ్యూహాలకు భారత్ అడ్డుకట్టవేసింది.
తూర్పు లద్దాక్ లో భారత్ -చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ సైన్యాన్ని కట్టుదిట్టం చేసింది. ఆగస్టు 29న ఈ సరస్సు దక్షిణ తీరాన్ని చేజిక్కించుకునేందుకు డ్రాగన్ విఫలయత్నం చేసిన నేపథ్యంలో భారత సైన్యం తన వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది . లద్దాక్ లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు నిర్వహణ మాత్రమే చేపట్టే భారత్ ఇప్పుడు “సరిహద్దు రక్షణ” కూడా పూనుకుంది. ఇందుకు అనుగుణంగా సైన్యం వివిధ విభాగాలతో మిశ్రమ దళాలను అక్కడ మోహరించింది. మరోవైపు ఉత్తర తీరంలోని కీలకమైన ఫింగర్ -4 పర్వతాల చైనా కబ్జాలో ఉన్నాయి. అయితే ఈ ఫింగర్ ప్రాంతం లోనూ ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్ భారత్ ఒత్తిడి పెంచింది.
గార్డింగ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశ రహస్య స్పెషల్ ఫ్రాంటిరియర్ ఫోర్స్ (ఎస్ ఎఫ్ ఎఫ్) ముందుగానే డ్రాగన్ కుట్రను పసిగట్టి భారత సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న టకుంగ్ పరిసరాల్లో చైనా బలగాలతో సంబంధం లేకుండా భారత సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది.
యూకే టెలిగ్రాఫ్ లో ఒక నివేదిక ప్రకారం ఆగస్టు 29న దాదాపు 500 మంది చైనా సైన్యం భారత్ భూభాగంలోని చుషుల్ గ్రామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన భారత సైన్యం, చైనా బలగాలను అడ్డుకుని ముందుగానే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.
మరోవైపు నేపాల్ లోని భారత్, చైనా, టిబెట్ సరిహద్దు లను కలిపే ట్రై జంక్షన్ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాల నుండి సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో పోలీసు దళం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లను అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఎస్బి దళాలను అరుణాచల్ ప్రదేశ్ లోని భారత్, నేపాల్ సరిహద్దుల్లో కి తరలించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరో కుట్రకు పాల్పడుతున్న డ్రాగన్
భారత్-చైనా మధ్య తూర్పు లద్దాక్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే ప్రభుత్వం మరో కుతంత్రానికి పాల్పడుతోంది. నేపాల్ భారత్ సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలతో భారత వ్యతిరేక ఆందోళనలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ విషయాన్ని భారత నిఘా సంస్థ గుర్తించింది. నేపాల్ సరిహద్దు గ్రామాలలో, పలు సంస్థలకు 2.5 కోట్ల రూపాయలు పంపిణీ చేసిందని నిఘా సంస్థ తేల్చింది. ఈ కుట్ర వెనక నేపాల్ లోని చైనా రాయబార కార్యాలయం ఉన్నట్టు గుర్తించింది.
We are now dominating Spanggur Gap & Post. One the most important Area of LaC.
LaC is Highly Active now. #IndiaChinaBorderTension https://t.co/EAsjsYII3c— Guarding India (@guardingindia) August 31, 2020
Souce :