- గుజరాత్ లో ఇతర రాష్ట్రాల వారిపై దాడుల కేసు: 22 మంది కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
- నిందితుల్లో అల్పేష్ ఠాకూర్ సేనా సోషల్ మీడియా కోఆర్డినేటర్
గుజరాత్ లో సాధారణ పరిస్థితితులు నెలకొంటున్న సమయంలో సమాజాన్ని విభజించేందుకు, హింసను ప్రేరేపించేందుకు కారణమైన వారెవరో క్రమంగా స్పష్టమౌతోంది. ఇప్పటి వరకు వెలుగుచూసిన నిందితుల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేర్లు అందరికన్నా ప్రముఖంగా ఉన్నాయి. వీరి ప్రోద్బలంతోనే ప్రజలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన సోదరులపై హింసను తలపెట్టినట్టు తెలుస్తోంది.
అల్పేష్ ఠాకూర్, గేనిబెన్ లు మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరొకపక్క రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేసిన కృషి వల్ల చాలా ప్రాంతాలలో ‘సాధారణ పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాలలో పరిస్థితిని ముందుగానే అదుపు చేయడం జరిగింది.
రవీంద్ర సాహు అనే వ్యక్తి సెప్టెంబర్ 28న 14 నెలల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్ దగ్గర ఉవార్సద్ అనే గ్రామంలోని గాంధీనగర్ తాలూకా పంచాయతీలో కాంగ్రెస్ ప్రతినిధి మోహతాజి ఠాకూర్ గ్రామంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన సోదరులను తెల్లవారేసరికి గుజరాత్ వదిలి వెళ్లాల్సిందిగా బెదిరించాడు. అంతేకాక ఈ బెదిరింపుతో కూడిన ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
గాంధీనగర్ జిల్లాలోని కొన్ని గ్రామాలలో అక్కడక్కడా చిన్నపాటి సంఘటనలు జరిగాయి. కానీ కలోల్ (ఉత్తర గుజరాత్) దగ్గర ఛత్రల్, ఖత్రజ్, కడి పరిసరాలలోని పారిశ్రామిక ప్రాంతాలలో మాత్రం ఠాకూర్ సైన్యం సభ్యులు ఇతర ప్రాంతాలకు చెందిన సోదరులపైన దాడి చేశారు. ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు మీడియా కూడా దీన్నిపదే పదే ప్రసారం చేసింది.
ఈ ఘటనలు జరిగిన వెంటనే జిల్లా పాలనా యంత్రాంగం తగు చర్యలు తీసుకుంది. పోలీసులు దీనికి సంబంధించి మొత్తం 533 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో 22 మంది స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మొత్తం పరిస్థితి ఉద్రిక్తంగా మారేందుకు కారకుడిగా అల్పేష్ ఠాకూర్ మీద ఆరోపణలు ఉన్నాయి. అల్పేష్ ఠాకూర్ సైన్యం యొక్క సోషల్ మీడియా కన్వీనర్ ని కూడా నిర్బంధించారు. ఓబీసీ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న అల్పేష్ ఠాకూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక సభల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారిపై ప్రమాదకరమైన వ్యాఖ్యలు, బెదిరింపులు చేసిన దాఖలాలు ఉన్నాయి.
అదే సమయంలో అక్టోబర్ 10న యువ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి జనాలు పారిపోతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని ట్వీట్ చేశారు. ఇంతవరకు ఆ ఫోటో అలాగే ఉంది.
गंगा के लाल ने, अपना फर्ज निभा दिया,
यूपी बिहार के बिछड़े, बच्चों को वापिस घर पंहुचा दिया।
जिन्होंने 1947 का विभाजन नहीं देखा ,उनको 2018 का विभाजन दिखा दिया। pic.twitter.com/2QbHOcEXh0— Chhattisgarh Youth Congress (@IYCChhattisgarh) October 11, 2018
నిజానికి అది 2012లో మరొక సందర్భంలో తీసిన ఫోటో అని ఋజువైంది.
గుజరాత్ ప్రజలు ఇతర ప్రాంతాల వారిని సహించరు అన్న తప్పుడు సందేశాన్ని ప్రచారం చేసేందుకు, గుజరాత్ ప్రజలను అవమానించేందుకు ఇది కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్ర తప్ప వేరొకటి కాదు.
సామాజిక సంఘాల కృషి:
ఈ సంఘటనలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ప్రాంతీయ సంఘచాలక్ ముకేష్ మల్కాన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అత్యంత దురదృష్టకరమైన ఒక సంఘటన అదనుగా, ఇతర ప్రాంతాలనుండి వచ్చి స్థిరపడ్డ సోదరులను లక్ష్యంగా చేసుకొని వారిపై జరిగిన దాడులు వారిని గుజరాత్ వదిలివెళ్లేలా చేస్తున్నాయని, ఇది ఎంతో బాధ కలిగించే అంశం అని పేర్కొన్నారు. ఇటువంటి దాడులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం అతి తీవ్రంగా ఖండిస్తోందని తెలియజేశారు. అందరినీ సమానంగా, సామరస్యంగా చూసే గుజరాతీ సంప్రదాయాన్ని దెబ్బ తీసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనీ, అలాగే ఇతర ప్రాంతాల వారు నివసించే ప్రదేశాలు, పని చేసే స్థలాల వద్ద గట్టి భద్రతా కల్పించాలనీ ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు.
పుకార్లు, అసత్య ప్రచారంతో ప్రభావితం కాకుండా, మన ప్రాంతంలో ఉన్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సోదరులకు రక్షణ కల్పించవలసినదిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గుజరాత్ ప్రజలకు, స్వయంసేవకులకు కూడా విజ్ఞప్తి చేసింది.బుధవారం అక్టోబర్ 10న కర్ణావతిలో సామాజిక సద్భావన సమితి, స్వయంసేవకులు కలిసి దాదాపు 60 స్థలాలలో రాష్ట్రాన్ని సమైక్యం చేయాలన్న సందేశాన్ని ప్రచారం చేశారు, ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్ని కూడళ్లలో సద్భావనా సందేశాన్ని వ్యాప్తి చేశారు. ఇప్పుడు పరిస్థితి సర్దుకోవడంతో గుజరాత్ విడిచి పారిపోతున్న వారి సంఖ్య తగ్గడమే కాదు, వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తున్నారు కూడా.
ఆ రోజు నుండి గాంధీనగరంలో కార్యకర్తలు చురుకుగా పని చేస్తున్నారు. తమ చుట్టు పక్కల గ్రామాల సర్పంచులతో మాట్లాడారు. ఇతర ప్రాంతాలవారిని గ్రామాల్లో ప్రముఖులకు పరిచయం చేశారు.
కర్ణావతి (అహమ్మదాబాద్) సమీపంలోని సానంద్ తాలూకాలో చాంగోదర్ గ్రామంలో ఒక పెద్ద పారిశ్రామిక ప్రాంతం ఉంది. అక్కడి సరస్వతీనగర్ కృష్ణానగర్లో 10 వేలకు పైగా ఇతర ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు. వారిలో బీహార్, ఉత్తరప్రదేశ్ కు చెందినవారు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఇతర ప్రాంత సోదరులపై జరిగిన దాడులు గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో, ఈ ప్రాంతంలో కూడా భయాందోళనల వాతావరణం ఏర్పడింది. సానంద్ తాలూకాలో కూడా సామాజిక సంస్థల కార్యకర్తలు సర్పంచ్, సామాజిక సామరస్యత సమితి కార్యకర్తలు, సరస్వతీనగర్, కృష్ణానగర్ లో నివసించేవారు, పారిశ్రామికవేత్తలను సంప్రదించి ప్రణాళికలు తయారుచేసి చుట్టుపక్కల ప్రాంతాలలో ఇతర ప్రాంత, స్థానిక ప్రజలతోను మాట్లాడి విషయాన్నీ అర్ధమయ్యేలా తెలియచేసారు. చుట్టు పక్కల గ్రామాలనుండి కొందరు వ్యక్తులు దాడులు జరిపే ఉద్దేశంతోనే రాగా, వారికి అర్ధమయ్యేలా చెప్పారు. ఈ కృషి వల్ల మొదట గొడవల్లో 200 మంది మాత్రమే ప్రాంతం వదిలి వెళ్లారు కానీ ఆ తర్వాత మాత్రం ఎవరూ ఆ ప్రాంతం విడిచిపోలేదు.
Source: VSK Bharat