Home News భారతీయతకు ప్రతిబింబం “కర్తవ్య మార్గ్”

భారతీయతకు ప్రతిబింబం “కర్తవ్య మార్గ్”

0
SHARE

ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందిన రాజ్‌ప‌థ్ ఇక‌పై క‌ర్త‌వ్య మార్గ్ అనే పేరుతో వాసికెక్క‌నుంది. ఇంత‌టి అత్యంత విశిష్ట‌త‌ను సంత‌రించుకున్న క‌ర్త‌వ్య‌మార్గ్ లో కీల‌కంగా నిలిచిన అంశాలు:

  • కర్తవ్య మార్గ్‌లో నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మొత్తం అవెన్యూ ప్రాంతం ఉంటుంది. ఈ మార్గం రైసినా హిల్‌లోని రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ ఇండియా గేట్ మీదుగా ఢిల్లీలోని నేషనల్ స్టేడియం వరకు కొనసాగుతుంది.
  •  ఇదే మార్గంలో 16 శాశ్వత నడక మార్గాల వంతెనలను అభివృద్ధి చేశారు.
  • వలసవాద ఆలోచనా విధానానికి స్వ‌స్తి చెబుతూ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం క‌ర్త‌వ్య‌మార్గ్‌కు నాంది ప‌లికింది.
  • రాజ్‌పథ్ అనేది కింగ్స్‌వే అనే ఇంగ్లీష్ ప‌దానికి హిందీ అనువాదం. ఇది బ్రిటిష్ పాలనలో ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మార్గంగా ఉండేది. దీనికి బ్రిటిష్ రాజైన ఐద‌వ‌ జార్జ్ ఆ పేరు పెట్టారు. 1911లో ఆయ‌న భారతదేశాన్ని సందర్శించారు.
  • కర్తవ్య మార్గ్ గా పేరు మార్చుకున్న ఒక‌ప్ప‌టి రాజ్‌ప‌థ్ నేడు భార‌త ప్ర‌జ‌ల సాధికారతను సంకేత మార్గంగా నిలిచింది.