Home News 26/11 ఉగ్ర‌దాడి బాధితులకు నివాళుల‌ర్పించ‌నున్న ఐక్య‌రాజ్య‌స‌మితి

26/11 ఉగ్ర‌దాడి బాధితులకు నివాళుల‌ర్పించ‌నున్న ఐక్య‌రాజ్య‌స‌మితి

0
SHARE

భార‌త్‌లో జ‌రిగిన 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులకు ఐక్య‌రాజ్య‌స‌మితి నివాళుల‌ర్పించ‌నుంది. సెప్టెంబరు 8, 9 తేదీల్లో జ‌రుగుతున్న UN గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి బాధితులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద బాధితులకు ఐక్యరాజ్యసమితి నివాళులర్పించ‌నుంది.

UN వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సభ్య దేశాలు, పౌర సమాజ సంస్థలు చేపట్టే మంచి గురించి తెల‌ప‌డానికి స‌భ్యుల‌కు కాంగ్రెస్ అనుమతిస్తుంది. ఈ సంద‌ర్భంగా బాధితుల స‌మ‌స్య‌ల‌ను స‌మావేశ దృష్టికి వ‌స్తాయి. వారి అనుభవాలు వారి స్వంత దేశాలలో స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాల్ని సూచిస్తాయి.

గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ టెర్రరిజం స‌మావేశ ప్రారంభోత్సవంలో UN చీఫ్ గుటెర్రెస్, కౌంటర్ టెర్రరిజం అండర్ సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ వోరోన్‌కోవ్, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం, రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్, ది కో-ఛైర్‌లతో సహా ఉన్నత స్థాయి భాగస్వామ్యం ఉంటుంది. కింగ్‌డమ్ ఆఫ్ స్పెయిన్, ఇతర సీనియర్ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

తీవ్ర‌వాద బాధితుల గుర్తింపు; పరిస్థితుల విశ్లేషణ; మారుతున్న ఉగ్రవాద స్వభావం; పునరావాసం, సహాయం, మద్దతు; తీవ్రవాద బాధితులకు న్యాయం పొందే హక్కుల‌ను, అవసరాలను పరిష్కరించడం; వంటి ఉగ్రవాద బాధితుల హక్కుల‌ను, అవసరాలను ప్రతిబింబించే ఆరు నేప‌థ్య కార్య‌క్ర‌మాల‌ను గ్లోబల్ కాంగ్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది.